తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Unlinking Fb And Insta: ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేయడం ఎలా?

Unlinking FB and Insta: ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేయడం ఎలా?

HT Telugu Desk HT Telugu

24 May 2024, 14:53 IST

google News
  • Unlinking FB and Insta: మీ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ను వేరువేరుగా మేనేజ్ చేయాలనుకుంటున్నారా? ఐఫోన్లో లేదా వెబ్ బ్రౌజర్ ద్వారా మీ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేసుకోవచ్చు. అందుకు అవసరమైన స్టెప్స్ ఈ కింద వివరించాము.

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేయడం
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేయడం (AFP)

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అన్ లింక్ చేయడం

Unlinking FB and Insta: చాలా మంది వినియోగదారులు తమ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను రెండు ప్లాట్ఫామ్ లలో సులభంగా మేనేజ్ చేయడానికి వాటిని లింక్ చేస్తారు. అయితే, కొన్నిసార్లు మీరు వ్యక్తిగత కారణాల వల్ల మీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ను వేరువేరుగా ఉంచాలనుకోవచ్చు. మీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఎలా అన్ లింక్ చేయాలో ఇక్కడ ఉంది. అలాగే, అన్ లింక్ చేయడం వల్ల మీ పోస్ట్ లు, ఫాలోవర్లు లేదా ఇతర ఏ డేటా కూడా తొలగించబడదు.

ఐఫోన్ లో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను అన్ లింక్ చేయడం ఎలా?

మీరు ఇన్ స్టాగ్రామ్ లేదా ఫేస్ బుక్ యాప్ ను ఉపయోగించి మీ ఖాతాలను అన్ లింక్ చేయవచ్చు.

ఇన్ స్టాగ్రామ్ యాప్ ద్వారా:

1. ఇన్ స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి కుడివైపు దిగువన ఉన్న ప్రొఫైల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.

2. మెనూ ఐకాన్ (మూడు హారిజాంటల్ లైన్లు) ట్యాప్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీకి వెళ్లండి.

3. అకౌంట్స్ సెంటర్ ను, ఆపై అకౌంట్స్ సెలెక్ట్ చేయండి.

4. మీ ఫేస్ బుక్ అకౌంట్ పక్కన తొలగించు (Remove) నొక్కండి.

5. ప్రాంప్ట్ లను అనుసరించండి: వరుసగా వచ్చే సూచనలను ఫాలో అవుతూ అన్ లింక్ చేయండి.

ఫేస్ బుక్ యాప్ ద్వారా..

1. ఫేస్ బుక్ యాప్ ను ఓపెన్ చేసి కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ ను ట్యాప్ చేయాలి.

2. సెట్టింగ్స్ & ప్రైవసీ కోసం గేర్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.

3. అకౌంట్స్ సెంటర్ లో మరింత చూడండి (See more) ఎంచుకోండి.

4. కిందికి స్క్రోల్ చేసి అకౌంట్స్ సెలెక్ట్ చేయండి.

5. మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా పక్కన ఉన్న తొలగించు (Remove) బటన్ ను నొక్కండి.

6. ప్రాంప్ట్ లను అనుసరించండి: వరుసగా వచ్చే సూచనలను ఫాలో అవుతూ అన్ లింక్ చేయండి.

వెబ్ బ్రౌజర్ ద్వారా..

1. ఫేస్ బుక్ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.

2. మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ & ప్రైవసీ ని, ఆపై సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేయండి.

3. సైడ్ బార్ నుండి, అకౌంట్స్ సెంటర్ లో మరింత చూడండి ((See more)) ఎంచుకోండి.

4. అకౌంట్స్ లోకి వెళ్లండి.

5. మీరు అన్ లింక్ చేయాలనుకుంటున్న ఖాతా పక్కన తొలగించు (Remove) పై క్లిక్ చేయండి.

6. ప్రాంప్ట్ లను అనుసరించండి: వరుసగా వచ్చే సూచనలను ఫాలో అవుతూ ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను అన్ లింక్ చేయండి.

ఇన్స్టాగ్రామ్ వెబ్ సైట్ ద్వారా..

మీరు ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు, కానీ దాని ఇంటర్ఫేస్ తక్కువ యూజర్ ఫ్రెండ్లీ. అవసరమైతే, ఇన్స్టాగ్రామ్ వెబ్ సైట్ కు వెళ్లి, మోర్ క్లిక్ చేయండి, ఆపై సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అనంతరం మీ ఫేస్ బుక్, ఇన్ స్టా లను అన్ లింక్ చేయడానికి.. వరుసగా వచ్చే సూచనలను ఫాలో కండి.

తదుపరి వ్యాసం