Honor 80 GT : హానర్ 80 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్! లాంచ్ ఎప్పుడంటే..
27 November 2022, 14:04 IST
- Honor 80 GT launch : హానర్ 80 సిరీస్ నుంచి హానర్ 80 జీటీ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆ వివరాలు..
హానర్ ఎక్స్8
Honor 80 GT lanuch : చైనాలో హానర్ 80 సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. హానర్ 80, హానర్ 80 ఎస్ఈ, హానర్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్స్.. ఈ సిరీస్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ హానర్ 80 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చి చేరుతోందని సమాచారం. హానర్ 80 జీటీని.. సంస్థ లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ హానర్ 80 జీటీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఓ చైనీస్ టిప్‌స్టర్ ప్రకారం.. హానర్ 80 జీటీకి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. హానర్ 80, హానర్ 80 ఎస్ఈ, హానర్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌కు ఓఎల్ఈడీ ప్యానెల్స్‌తో కూడిన కర్వడ్ ఎడ్జ్‌లు ఉన్నాయి.
హానర్ 80 జీటీ ఫీచర్స్..
Honor 80 GT specification : ప్రత్యేకంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను రూపొందించింది హానర్ సంస్థ. ఇక ఈ హానర్ 80 జీటీలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఉండే అవకాశం ఉంది. దీనికి మించి.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
అయితే.. హానర్ ఎక్స్40 జీటీలో ఉన్న రేర్ డిజైనే.. ఈ హానర్ 80 జీటీకి కూడా వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ హానర్ 80 జీటీ ఫీచర్స్పై మరింత సమాచారం అందుబాటులోకి రావొచ్చు.
Honor 80 series : హానర్ 80 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇందులో 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1224X2700 పిక్సెల్స్ రిసొల్యూషన్తో కూడిన కర్వడ్ ఎడ్జ్ స్క్రీన్ ఉంది. మేజిక్ యూఐ7 ఆధారిత ఆండ్రాయిడ్ 12 దీని సొంతం. ఇందులో 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50ఎంపీ+2ఎంపీ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా సెటప్.. ఈ హానర్ 80 ప్రోలో ఉంది. రేర్‌లో.. 160ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 4,800ఎంఏహెచ్.