తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor 200 : హానర్​ 200 లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Honor 200 : హానర్​ 200 లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

28 May 2024, 7:31 IST

google News
  • Honor 200 launch : హానర్ 200 సిరీస్​ను చైనాలో లాంచ్ చేసింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ సంస్థ. స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్​తో కూడిన ఈ గ్యాడ్జెట్​ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ హానర్​ 200 విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హానర్​ 200 5జీ లాంచ్​..
హానర్​ 200 5జీ లాంచ్​.. (Honor China)

హానర్​ 200 5జీ లాంచ్​..

Honor 200 launch in India : దిగ్గజ స్మర్ట్​ఫోన్​ తయారీ సంస్థ హానర్.. చైనాలో కొత్త సిరీస్​ని లాంచ్​ చేసింది. దాని పేరు హానర్ 200 సిరీస్. ఇందులో.. హానర్​ 200, హానర్​ 200 ప్రో గ్యాడ్జెట్స్​ ఉన్నాయి. త్వరలోనే కొత్త ఫోన్ భారతదేశానికి రానుందని కంపెనీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హానర్ 200 స్పెసిఫికేషన్లు..

హానర్ 200లో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ కర్వ్​డ్ ఓఎల్ఈడీ డిస్​ప్లే, 2664×1200 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్ 100% డీసీఐ-పీ3 కలర్ గేమట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యుఎమ్ డిమ్మింగ్​ను కలిగి ఉంది.

Honor 200 price in India : హానర్ 200 4 ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 చిప్​సెట్​పై పనిచేస్తుంది. గ్రాఫిక్స్ సంబంధిత అన్ని పనులను నిర్వహించడానికి అడ్రినో 720 జీపీయూతో జత చేయడం జరిగింది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ సెన్సార్, 112 మెగాపిక్సెల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ (ఎఫ్ఓవీ) తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2.5ఎక్స్ లాస్లెస్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్​కు సంబంధించిన అవసరాల కోసం ముందువైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్​ను అందించారు.ఈ స్మార్ట్​ఫోన్​లో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. హానర్ 200 ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 పై పనిచేస్తుంది.

హానర్ 200 ప్రో స్పెసిఫికేషన్లు..

హానర్ 200 ప్రో స్మార్ట్​ఫోన్​.. 6.78 ఇంచ్​ ఓఎల్ఈడి ప్యానెల్ తో వస్తుంది. ఇది 16 జీబీ ర్యామ్- 1 టీబీ వరకు స్టోరేజ్​తో వస్తుంది. తాజా హానర్ పరికరం క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్​సెట్​తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ సంబంధిత పనులన్నింటినీ నిర్వహించడానికి అడ్రినో 735 జీపీయూ కనెక్ట్​ అయ్యి ఉంటుంది.

Honor 200 specifications : ఆప్టిక్స్ కోసం, వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ఓవి 50 హెచ్ సెన్సార్​తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెటప్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.

ఇక ఈ హానర్​ 200 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియా లాంచ్​పై క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్​ లభించే అవకాశం ఉంది.

హానర్​ మ్యాజిక్​ 6 ప్రో లాంచ్​..

ఇండియా మార్కెట్​పై ఫోకస్​ చేసిన హానర్​ సంస్థ.. హానర్​ మ్యాజిక్​ 6 ప్రోని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. హానర్​ మ్యాజిక్​ 6 ప్రో 12 జీబీ ర్యామ్ / 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1299 యూరోలుగా(సుమారు రూ.1,16,000) నిర్ణయించారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్ ధరపై స్పష్టత రావాలంటే అధికారిక లాంచ్​ వరకు ఎదురుచూడాల్సిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం