Honor Magic 6 Pro : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ మ్యాజిక్​ 6 ప్రో.. ఫీచర్స్​ ఇవే!-honor magic 6 pro confirmed to launch in india soon all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor Magic 6 Pro : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ మ్యాజిక్​ 6 ప్రో.. ఫీచర్స్​ ఇవే!

Honor Magic 6 Pro : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ మ్యాజిక్​ 6 ప్రో.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
May 27, 2024 03:30 PM IST

Honor Magic 6 Pro price : స్నాప్​డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, 5,600 ఎంఏహెచ్ బ్యాటరీతో హానర్ ఫ్లాగ్​షిప్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్​ఫోన్.. భారత్​లోకి రానుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హానర్​ మ్యాజిక్​ 6 ప్రో.. త్వరలోనే లాంచ్​!
హానర్​ మ్యాజిక్​ 6 ప్రో.. త్వరలోనే లాంచ్​!

Honor Magic 6 Pro price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఫోకస్​ చేసింది దిగ్గజ టెక్​ సంస్థ హానర్. ఈ నేపథ్యంలో.. తన ఫ్లాగ్​షిప్​ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్​ఫోన్​ని త్వరలో భారత్​కు తీసుకురానుంది. ఈ విషయాన్ని హెచ్​టీ టెక్​ ధ్రువీకరించింది. అధికారిక ధృవీకరణతో పాటు, కొత్త అమెజాన్ ఇండియా లిస్టింగ్ ఈ ఫోన్ గురించి అనేక కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. వీటిలో క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ జెన్ 3 ప్రాసెసర్ (ప్రత్యేక హానర్ డిస్క్రిట్ సెక్యూరిటీ చిప్ ఎస్ 1తో జతచేశారు), 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

హానర్ వాచ్ జీఎస్3, హానర్ ఛాయిస్ ఎక్స్5 ప్రో ఇయర్​బడ్స్, ప్రీమియం ఫోన్ కేస్, హానర్ వీఐపీ కేర్+ సర్వీస్​తో కూడిన గిఫ్ట్ బండిల్​కి ఈ హానర్​ మ్యాజిక్​ 6 ప్రో డివైజ్​ యాడ్​ చేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హానర్ మ్యాజిక్ 6 ప్రో ధర..

Honor Magic 6 Pro launch date in India : హానర్​ మ్యాజిక్​ 6 ప్రో 12 జీబీ ర్యామ్ / 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1299 యూరోలుగా(సుమారు రూ.1,16,000) నిర్ణయించారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్ ధరపై స్పష్టత రావాలంటే అధికారిక లాంచ్​ వరకు ఎదురుచూడాల్సిందే.

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్పెసిఫికేషన్లు..

తాజా ఫోన్ గురించి హానర్​ సంస్థ ఎటువంటి ఫీచర్లను వెల్లడించనప్పటికీ, మ్యాజిక్ 6 ప్రో గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. భారతదేశానికి వస్తున్న డివైస్ గురించి మనకు సరైన అవగాహన లభిస్తుంది.

హానర్​ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్​ఫోన్​ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ తో కూడిన 6.8 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ + కర్వ్ డ్ ఓఎల్ఈడీ డిస్​ప్లేతో వస్తుంది. లేటెస్ట్ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్, గ్రాఫిక్స్​కు సంబంధించిన అన్ని పనుల కోసం అడ్రినో 750జీపీయూతో జత చేశారు. ఇందులో 12 జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్​ని సంస్థ అందిస్తోంది.

Honor Magic 6 Pro specifications in Telugu : వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 180 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత పనుల నిర్వహణ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. ఫ్రెంట్ కెమెరా 4కే వీడియోలను 30 ఎఫ్​పీఎస్ వద్ద, వెనుక కెమెరా 60 ఎఫ్​పీఎస్ వద్ద 4కే వీడియోలను రికార్డ్ చేయగలదు. సాఫ్ట్​వేర్ విషయానికి వస్తే.. ఈ మ్యాజిక్​ 6 ప్రో.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8 పై పనిచేస్తుంది. ఈ పరికరంతో 4 సంవత్సరాల ఓఎస్ అప్​డేట్ లు. 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను కంపెనీ హామీ ఇస్తుంది.

ఇక ఈ హానర్​ మ్యాజిక్​ 6 ప్రో స్మార్ట్​ఫోన్​ పూర్తి ఫీచర్స్​, సరైన ధర వివరాలు తెలుసుకోవాలంటే.. లాంచ్​ వరకు ఎదురుచూడాల్సిందే. లాంచ్​ డేట్​పై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం