Mahindra XUV700 AX5 select launch : మహీంద్రా అండ్ మహీంద్రాకు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటి.. ఎక్స్‌యూవీ700. ఇక ఇప్పుడు ఈ ఎస్యూవీ కొత్త వేరియంట్‌ను సంస్థ లాంచ్ చేసింది. తక్కువ ధరలో మరిన్ని ప్రీమియం ఫీచర్లతో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 సెలెక్ట్ వేరియంట్ లాంచ్ అవ్వడం విశేషం. దీని ఎక్స్‌షోరూం ధర రూ.16.89 లక్షలు. మోడల్ టాప్ వేరియంట్లలో ఎక్కువగా కనిపించే ఫీచర్లను ఇందులో పొందుపరిచింది సంస్థ. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొత్త వేరియంట్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్యూవీ ఎక్స్‌షోరూం రూ .27 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో, మేన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో ఆరు- ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో ఈ వెహికిిల్ లభిస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 సెలెక్ట్ వేరియంట్లో స్కైరూఫ్, 10.24 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ వేరియంట్ ఏడు సీట్ల లేఅవుట్‌తో వస్తోంది.
ఎక్స్‌యూవీ700 ఎస్యూవీ ఏఎక్స్5 సెలెక్ట్ వేరియంట్లో వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సౌండ్ స్టేజింగ్‌తో ఆరు స్పీకర్లు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌పై ఆండ్రినోఎక్స్ సిస్టెమ్, అమెజాన్ అలెక్సా బిల్ట్ ఇన్, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ఫుల్ సైజ్ వీల్ కవర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Mahindra XUV700 on road price in Hyderabad : మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్యూవీ ఏఎక్స్ 5 సెలెక్ట్ వేరియంట్ ప్రధానంగా ఈ టాప్-ఎండ్ ఫీచర్లలో కొన్నింటిని కోరుకునే ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుందని, ఎస్యూవీ టాప్ వేరియంట్‌ను ఎంచుకునే బడ్జెట్ లేని వారికి ఇది చక్కటి ఆప్షన్ అవుతుందని మహీంద్రా ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది.
2021 ఆగస్టులో మొదటిసారిగా లాంచ్ అయిన ఈ ఎక్స్‌యూవీ 700 మహీంద్రా క్యాంప్ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాడక్ట్స్‌లో ఒకటి. అత్యాధునిక ఫీచర్లు, సమర్థవంతమైన డ్రైవ్‌తో కూడిన అర్బన్ ఎస్‌యూవీగా ఇది నిలిచింది. ప్రధానంగా దీనికి అనుకూలంగా పనిచేసింది దాని ఆధునిక స్టైలింగ్, ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్. అందుకే దీనికి మంచి డిమాండ్ లభిస్తోంది.
Mahindra XUV700 : మహీంద్రా ఎక్స్‌యూవీ700 సక్సెస్‌తో దాని కోసం వెయిటింగ్ పీరియడ్ చాలా నెలలు కొనసాగింది. అయితే, ఎక్స్‌యూవీ 700 ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు కంపెనీ ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ700 వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఎనిమిది వారాల మధ్య ఉంది. ఎక్స్‌యూవీ 700 కోసం వెయిటింగ్ పీరియడ్.. ఎంచుకున్న వేరియంట్ పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
మహీంద్రా కేవలం భారత మార్కెట్లోనే కాకుండా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి విదేశీ మార్కెట్లలో కూడా ఈ ఎక్స్ యూవీ700ని విక్రయిస్తోంది.
ఇక ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 సెలెక్ట్ వేరియంట్‌తో ఈ ఎస్‌యూవీకి డిమాండ్ మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
సంబంధిత కథనం