Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..
Mahindra XUV 3XO bookings: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ మే 15 న అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్నకొనుగోలుదారులు మహీంద్ర అధికారిక షో రూమ్ ల్లో రూ .21,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ కాంపాక్ట్ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు.
Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్ యూవీ 300 కి అప్డేటెడ్ వర్షన్ గా ఎక్స్ యువీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్ యూవీని మహీంద్ర అండ్ మహీంద్ర కొద్ది రోజుల క్రితం భారతదేశంలో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ బుకింగ్స్ అనధికారికంగా డీలర్ షిప్ ల వద్ద ఇప్పటికే ప్రారంభం కాగా, మే 15 నుంచి అధికారికంగా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో బుకింగ్ లు ప్రారంభమవుతున్నాయి. ఆసక్తిగల వినియోగదారులు అధికారిక డీలర్ షిప్ ల వద్ద, లేదా ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా రూ .21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్ యూవీ ధరను రూ.7.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. ఈ కంపాక్ట్ ఎస్ యూ వీ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్ యూవీలకు మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.
ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ వో (Mahindra XUV 3XO) గణనీయమైన అప్ డేటెడ్ డిజైన్, విస్తృత శ్రేణి తాజా ఫీచర్లతో వస్తుంది. అయితే, మెకానికల్ గా, మహీంద్ర ఎక్స్ యూ వీ 300 తో పోలిస్తే, ఈ మహీంద్ర 3ఎక్స్ఓ లో ఎటువంటి మార్పు లేదు. ఇందులో కూడా మహీంద్రా ఎక్స్ యూవీ 300 మాదిరిగానే పవర్ట్రెయిన్ సెటప్ ఉంది. ఈ ఎస్ యూవీ లో కొత్త ఫ్రంట్ ప్రొఫైల్ ను పొందుపర్చారు. అలాగే, రీ డిజైన్ చేసిన రేడియేటర్ గ్రిల్, కొత్త డిజైన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు, ఇన్వర్టెడ్ ఎల్ ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్ లతో ఈ ఎస్యూవీ మరింత దూకుడుగా కనిపిస్తుంది.
మరింత స్పోర్టియర్ లుక్..
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఎస్ యూవీ కొత్త డిజైన్ తో ఉన్న అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ వైబ్ ను జోడిస్తున్నాయి. ఇతర డిజైన్ ఎలిమెంట్స్ ఎక్స్యూవీ 300 (Mahindra XUV 30O) మాదిరిగానే ఉన్నాయి. వెనుక భాగంలో, టెయిల్ లైట్లు పూర్తిగా రీ డిజైన్ చేశారు. టెయిల్ గేట్ మధ్యలో కొత్త ఎల్ఇడి స్ట్రిప్ ను ఏర్పాటు చేయడంతో పాటు సీ-ఆకారంలో ఉన్న ఎల్ఈడీ టెయిల్ లైట్లను కనెక్ట్ చేయడం వల్ల ఈ ఎస్యూవీ మరింత స్పోర్టియర్ లుక్ తో కనిపిస్తోంది.
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఇంటీరియర్
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) ఇంటీరియర్లో పలు మార్పులు చేశారు. ఇది సెగ్మెంట్-లీడింగ్ డ్యూయల్-ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్ తో వస్తుంది. అయితే కొన్ని వేరియంట్లు సింగిల్-ప్యాన్ సన్ రూఫ్ తో వస్తున్నాయి. మహీంద్రా ఎక్స్ యూవీ 700లో ఉన్న లెవల్ 2 ఏడీఏఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో అడ్రినోఎక్స్ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ సేఫ్టీ ఫీచర్స్
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ వంటి అధునాతన టెక్నాలజీ ఆధారిత భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓలో లెవల్ 2 ఏడీఏఎస్ ఒక ప్రధాన ఫీచర్ గా వస్తుంది. మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే, మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.