Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్
Mahindra XUV700 Blaze Edition: 2024 లో మహింద్ర అండ్ మహింద్ర తన సక్సెస్ ఫుల్ మోడల్ ఎక్స యూ వీ 700 లో మరో లిమిటెడ్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. ఈ మహీంద్రా ఎక్స్ యూవీ 700 బ్లేజ్ ఎడిషన్ ఎక్స్ షో రూమ్ ధర ను రూ. 24.24 లక్షలుగా నిర్ణయించింది. ఇందులోని ఇంజన్ లో ఎటువంటి మార్పులు చేయలేదు.
మహీంద్రా తమ పాపులర్ ఎస్ యూవీ ఎక్స్ యూవీ 700 (Mahindra XUV700)లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. బ్లేజ్ ఎడిషన్ గా పిలిచే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.24.24 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. బ్లేజ్ ఎడిషన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ పవర్ ట్రెయిన్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లతో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ ఏటీ, డీజిల్ ఏటీ, ఎంటీ ఆప్షన్స్ ఉన్నాయి. 2024 మహీంద్రా ఎక్స్యూవీ700 బ్లేజ్ ఎడిషన్ (Mahindra XUV700 Blaze Edition) కాస్మెటిక్ మార్పులతో మాత్రమే వస్తుంది. ఇందులో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు.
న్యూ కలర్స్.. న్యూ డిజైన్
మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ (Mahindra XUV700 Blaze Edition) కొత్త మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్ లో నపోలీ బ్లాక్ హైలెట్స్ తో రూపుదిద్దుకుంది. కాబట్టి, పైకప్పు, వెలుపలి రియర్ వ్యూ అద్దాలు, గ్రిల్, అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇంటీరియర్ లో కూడా కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. క్యాబిన్ ఇప్పుడు నలుపు రంగులో ఉంటుంది. ఇది కొంచెం స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. అంతే కాదు, ఏసీ వెంట్ లపై రెడ్ కలర్ యాక్సెంట్స్, అప్ హోల్ స్టరీపై సెంటర్ కన్సోల్ ను మహీంద్రా అందిస్తోంది.
మెకానికల్ మార్పులు లేవు..
ఎక్స్యూవీ 700 బ్లేజ్ ఎడిషన్ లో మెకానికల్ గా ఎటువంటి మార్పులు లేవు. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. అవి 2.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ డీజల్ ఇంజన్. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బీహెచ్ పీ పవర్, 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజల్ ఇంజన్ 184 బీహెచ్ పీ పవర్, 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 6-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. ప్రస్తుతం మహింద్ర ఎక్స్యూవీ 700 (Mahindra XUV700) స్టాండర్డ్ మోడల్ ధర రూ.13.99 లక్షల నుంచి రూ.26.99 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
ఏప్రిల్ లో 41 వేల సేల్స్
మహీంద్రా అండ్ మహీంద్రా 2024 ఏప్రిల్లో భారత మార్కెట్లో మొత్తం 41,008 ఎస్యూవీలను విక్రయించినట్లు ప్రకటించింది, ఇది ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 18 శాతం ఎక్కువ. అంతర్జాతీయ ట్రెండ్ కు అనుగుణంగా భారత ప్యాసింజర్ వాహన మార్కెట్ లో ఎస్ యూవీల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 41,542 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు మహింద్ర తెలిపింది. రాబోయే నెలల్లో కూడా ఈ అమ్మకాల జోరును కొనసాగించాలని ఈ సంస్థ భావిస్తోంది. అందుకోసం మహీంద్రా ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్యూవీపై భారీ అంచనాలతో ఉంది. ఇది భారతదేశపు స్వదేశీ బ్రాండ్ నుండి వస్తున్న అతిచిన్న ఎస్యూవీగా ఉంది.