Honda bikes warranty : ఈ హోండా బైక్స్‌పై 10ఏళ్ల వరకు వారెంటీ..!
11 June 2023, 13:29 IST
- Honda bikes extended warranty : పలు మోడల్స్‌పై 10ఏళ్ల పాటు వారెంటీని ఇస్తోంది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఆ వివరాలు..
ఈ హోండా బైక్స్‌పై 10ఏళ్ల వరకు వారెంటీ..!
Honda bikes extended warranty : వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ ఎక్స్టెండెడ్ వారెంటీ ప్లస్ ప్రోగ్రామ్‌తో పలు బైక్స్‌పై 10ఏళ్ల వరకు వారెంటీ కవరేజ్‌ని ఇస్తోంది. వివరాల్లోకి వెళితే..
10ఏళ్ల పాటు వారెంటీ..
హోండా ఈడబ్ల్యూ ప్లస్ ప్రోగ్రామ్‌ను 250సీసీ బైక్స్ సెగ్మెంట్ వరకు అందిస్తోంది సంస్థ. బండి కొన్న 91 రోజుల నుంచి 9వ ఏడాది మధ్యలో ఎప్పుడైనా ఈ వెసులుబాటును పొందవచ్చు. వారెంటీతో పాటు రెన్యువల్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ వంటి ఆప్షన్స్‌ని కూడా ఇస్తోంది సంస్థ.
న్యూ హోండా ఎక్స్టెండెడ్ వారెంటీ ప్లస్ ధర 150ససీ బైక్ మోడల్స్‌కు రూ. 1,317గా ఉంది. 150 సీసీ- 250సీసీ బైక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లు ఈ వారెంటీ కోసం రూ. 1,667 కట్టాల్సి ఉంటుంది. అయితే వాహనం కొనుగోలు చేసిన ఏడాదిని బట్టి ఈ ఫైనల్ ప్రైజ్ మారుతుంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇదీ చూడండి:- Honda Dio H smart : హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే
వారెంటీలో వచ్చే ఫీచర్స్ ఇవే..
ఈ ఎక్స్టెండెడ్ వారెంటీని తీసుకున్న కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఇస్తోంది హోండా. అవి.. బైక్ కొని 7ఏళ్ల కావొస్తున్న కస్టమర్లకు 3 ఇయర్ పాలసీ, బైక్ 8వ ఏడాదిలో ఉన్న కస్టమర్లకు 2 ఇయర్ పాలసీ, 9వ ఏడాదిలో ఉన్న బైక్‌కు 1 ఇయర్ పాలసీ. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. హోండా స్కూటర్లు ఉన్న కస్టమర్లకు 1,20,000 కి.మీల వరకు, బైక్స్ ఉన్న వినియోగదారులకు 1,30,000 కి.మీల వరకు కవరేజ్ లభిస్తోంది.
Honda extended warranty plus : "కస్టమర్లను సంతృప్తి పరచడమే మాకు చాలా కీలకం. దేశంలో లీడింగ్ 2-వీలర్ మేన్యుఫ్యాక్చరర్గా.. కస్టమర్ల అంచనాలను అందుకోవడమే హోండా లక్ష్యం. సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించేందుకు మేము ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక ఈ ఎక్స్టెండెడ్ వారెంటీ ప్లస్ ప్రోగ్రామ్‌తో ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపడుతుంది. 10ఏళ్ల పాటు వారెంటీని ఇస్తున్న తొలి ప్రోగ్రామ్ ఇదే. దీనితో మాపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత బలపడుతుందని భావిస్తున్నాము," అని హెచ్ఎంఎస్ఐ సేల్స్- మార్కెటింగ్ డైరక్టర్ యోగేశ్ మాథుర్ తెలిపారు.
ఈ హోండా ఎక్స్టెండెడ్ వారెంటీ ప్లస్‌తో కీలకమైన హై వాల్యూ ఇంజిన్ పార్ట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా కవర్ అవుతుండటం విశేషం. ఏదైనా లోపాలు ఉంటే.. వాటిని రిప్లేస్ చేసుకోవచ్చు.