Honda Elevate : హోండా ఎలివేట్ లాంచ్.. కొత్త ఎస్యూవీ ధర ఎంతంటే..
04 September 2023, 13:16 IST
- Honda Elevate : ఇండియాలో హోండా ఎలివేట్ లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా ఎలివేట్ ఎస్యూవీ లాంచ్..
Honda Elevate launch : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా ఎలివేట్ ఎస్‌యూవీని తాజాగా లాంచ్ చేసింది సంస్థ. డెలివరీలు కూడా ప్రారంభమైనట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎస్యూవీ ఫీచర్స్ ఇవే..
హోండ్ ఎలివేట్ ఎస్యూవీ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, భారీ గ్రిల్, ఫాగ్ లైట్స్ కోసం ట్రైయాంగ్యులర్ హోజింగ్, ఫౌక్స్ స్కిడ్ ప్లేట్స్, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి. రూఫ్ రెయిల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉన్నాయి.
ఈ హోండా కొత్త ఎస్యూవీ కేబిన్‌లో డ్యూయెల్ టోన్ థీమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, హోండా సెన్సింగ్ ఏడీఏఓఎస్ సూట్ వంటివి లభిస్తున్నాయి. దాదాపు అన్ని అదునాతన ఫీచర్స్ ఇందులో లభిస్తుండటం విశేషం.
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 119 హెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్బైక్స్ దీని సొంతం. ఈ మోడల్ మేన్యువల్ వేరియంట్ మైలేజ్ 15.3 కేఎంపీఎల్ అని, సీవీటీ వేరియంట్ మైలేజ్ 16.92 కేఎంపీఎల్ అని సంస్థ చెబుతోంది.
ఇదీ చూడండి:- Tata Nexon Facelift : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న 10 కొత్త ఫీచర్స్ ఇవే..!
ఈ మోడల్ ధర వివరాలివే..
Honda Elevate price in India : హోండా ఎలివేట్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ఎస్వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్. వాటి ఎక్స్‌షోరూం ధరలు..
ఎస్వీ ఎంటీ- రూ. 10.99లక్షలు
వీ ఎంటీ- రూ. 12,10,900
వీఎక్స్ ఎంటీ- రూ. 13,49,000
జెడ్ఎక్స్- రూ. 14,89,900
వీ సీవీటీ- రూ. 13,20,900
వీఎక్స్ సీవీటీ- రూ. 14,59,900
జెడ్ఎక్స్- రూ. 15,99,900
డెలివరీలు షురూ..
Honda Elevate on road price Hyderabad : ఇండియాలో ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. కానీ హోండాకు ఈ సెగ్మెంట్లో ఒక్క మోడల్ కూడా లేదు. ఈ లోటు భర్తీ చేసేందుకు ఎలివేట్‌పై గట్టిగానే ఫోకస్ చేసింది ఆటోమొబైల్ సంస్థ. జులైలో ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇక తాజాగా.. ఎలివేట్ ఎస్‌యూవీని లాంచ్ చేసి, డెలివరీలను సైతం మొదలుపెట్టింది. అంతేకాకుండాా.. 2026 నాటికి హోండా ఎలివేట్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇక ఈ హోండా ఎలివేట్ ఎస్యూవీ.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రేటా వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలియాల్సి ఉంది.