Honda Activa : సరికొత్తగా హోండా యాక్టివా.. లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ విశేషాలివే!
29 September 2023, 6:20 IST
- Honda Activa : హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది. ఈ మోడల్ ప్రత్యేకతల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
సరికొత్తగా హోండా యాక్టివా.. లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ విశేషాలివే!
Honda Activa limited edition : హోండా యాక్టివా స్కూటర్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీనిని మరింత క్యాష్ చేసుకునేందుకు.. సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సరికొత్తగా హోండా యాక్టివా..
హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లో స్టాండర్డ్, హెచ్- స్మార్ట్ పేర్లతో రెండు వేరియంట్స్ ఉంటాయి. పర్ల్ సైరెన్ బ్లూ, మాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్స్ కొత్తగా లభిస్తున్నాయి. బాడీ ప్యానెల్‌కు బ్లాక్ క్రోమ్ యాక్సెంట్స్, స్ట్రిప్స్ వంటివి కొత్తగా వస్తున్నాయి. ఇక యాక్టివా 3డీ ఎంబ్లమ్కు ప్రీమియం బ్లాక్ క్రోమ్ గార్నిష్ లభిస్తోంది. రేర్ గ్రాబ్ రెయిల్కి కూడా బాడీ కలర్ డార్క్ ఫినిషింగ్ ఉంటుంది.
Honda Activa limited edition price : ఇంజిన్ పరంగా.. ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో 109.51 సీసీ, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇదొక బీఎస్6 ఓబీడీ2 రెడీ మోడల్. ఈ ఇంజిన్ 7.37 బీహెచ్పీ పవర్‌ను, 8.90 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి కొత్త బైక్.. పల్సర్ ఎన్150 లాంచ్- ధర ఎంతంటే!
"ఇండియన్ 2 వీలర్ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాహనం యాక్టివా. రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది భారతీయులకు ఈ స్కూటర్ చేరింది. అన్ని వయస్సు గల వారికి ఇది చాలా నచ్చింది. ఇక లిమిటెడ్ ఎడిషన్‌కి కూడా మంచి డిమాండ్ లభిస్తుందని మేము ఆశిసిస్తున్నాము. ముఖ్యంగా న్యూ జనరేషన్ కోసమే దీనిని రూపొందించాము," అని సంస్థ ఎండీ, సీఈఓ సుసుము ఒటాని తెలిపారు.
కొత్త యాక్టివా ధర ఎంతంటే..
Honda Activa latest news : సరికొత్త హోండా యాక్టివా స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 80,734. ఇక హెచ్-స్మార్ట్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 82,734గా ఉంది. హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్స్‌లో ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
పైగా.. ఈ మోడల్‌కు 10ఏళ్ల వారెంటీ ప్యాకేజ్ని కూడా ఇస్తోంది హోండా సంస్థ. 3ఏళ్ల స్టాండర్డ్, 7ఏళ్ల ఎక్స్టెండెడ్ వారెంటీ ఆప్షన్ లభిస్తోంది.
ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ హోండా యాక్టివా.. టీవీఎస్ జూపిటర్, హీరో మేస్ట్రో ఎడ్జ్‌తో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.