Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి కొత్త బైక్.. పల్సర్ ఎన్150 లాంచ్- ధర ఎంతంటే!
Bajaj Pulsar N150 : బజాజ్ ఆటో నుంచి మరో కొత్త బైక్ లాంచ్ అయ్యింది. ఈ బజాజ్ పల్సర్ ఎన్150 ఫీచర్స్, ధర వివరాలు ఇవే..
Bajaj Pulsar N150 launch : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో.. సరికొత్త బైక్‌ను తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్ పేరు బజాజ్ పల్సర్ ఎన్150. ఈ మోడల్.. యువతను ఆకర్షించే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 వీలర్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త బైక్ ఎలా ఉందంటే..
పల్సర్ లైనప్‌లో వస్తున్న ఈ బైక్ డిజైన్‌లో చాలా మార్పులో చేసింది బజాజ్ సంస్థ. పల్సర్ ఎన్160 స్ఫూర్తితో దీనిని రూపొందించిందని చెప్పుకోవాలి. ఇందులోని ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ అగ్రెసివ్ లుక్‌ని ఇస్తోంది. పాత పలర్స్ బైక్స్‌లో ఐకానిక్ ఓల్ఫ్-ఐ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఉండేది. ఫ్యుయెల్ ట్యాంక్ మస్క్యులర్‌గా కనిపిస్తోంది. రేసింగ్ రెడ్, ఇబోనీ బ్లాక్, మెటాలిక్ పర్ల్ వైట్ కలర్స్‌లో ఈ బైక్ అందుబాటులోకి వస్తోంది.
Bajaj Pulsar N150 price : ఇక ఈ బజాజ్ పల్సర్ ఎన్150లో 149.68 సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్-ఎఫ్ఐ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. దీని 14.5 హెచ్‌పీ పవర్‌ను, 13.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తోంది. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ యూనిట్స్, రేర్‌లో మోనో షాక్ అబ్సార్బర్స్ సస్పెషన్స్ సెటప్ ఈ బైక్‌లో ఉంటుంది. ఇక ఫ్రెంట్లో 240ఎంఎం డిస్క్, రేర్‌లో 120ఎంఎం డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ సెటప్ కూడా ఉంది.
ఇదీ చూడండి:- Bajaj Auto electric scooters : బజాజ్ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఈ బజాజ్ పల్సర్ ఎన్150 మైలేజ్ 45-50 కేఎంపీఎల్ అని సంస్థ చెబుతోంది. పల్సర్ 150 కూడా ఇదే మైలేజ్ ఇచ్చేది. ఇక ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, (ఫ్యూయెల్ ట్యాంక్‌పై) యూఎస్బీ పోర్ట్ వంటివి వస్తున్నాయి.
కొత్త బైక్ ధర ఎంతంటే..
Bajaj Pulsar N150 price in Hyderabad : పల్సర్ లైనప్‌లో ఇప్పటికే బజాజ్ పీ150, ఎన్160, ఎన్250, ఎఫ్250 మోడల్స్ ఉన్నాయి. ఇక కొత్త బైక్ విషయానికొస్తే.. ఇండియాలో ఈ బజాజ్ పల్సర్ ఎన్150 ఎక్స్‌షోరూం ధర రూ. 1,17,677గా ఉంది.
పల్సర్ మోడల్స్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఈ కొత్త బైక్ కూడా భారతీయులను ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది. ముఖ్యంగా యువత నుంచి మంచి డిమాండ్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
సంబంధిత కథనం