Aprilia RS 457 vs KTM RC 390 : ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏది బెస్ట్?
Aprilia RS 457 vs KTM RC 390 : అప్రిలియా ఆర్ఎస్ 457 వర్సెస్ కేటీఎం ఆర్సీ 390.. ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Aprilia RS 457 vs KTM RC 390 : కొత్త బైక్‌ను ఇండియాలో ఆవిష్కరించింది అప్రిలియా సంస్థ. దీని పేరు అప్రిలియా ఆర్ఎస్ 457. ప్రీ బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ అవుతాయి. అక్టోబర్‌లో ఈ మోడల్ లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కేటీఎం ఆర్సీ 390తో ఈ మోడల్‌ను పోల్చి.. ఈ రెండిట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు బైక్స్ ఫీచర్స్ ఇవే..
అప్రిలియా ఆర్ఎస్ 457లో సిగ్నేచర్ ట్రిపుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డబుల్ ఫ్రెంట్ ఫేరింగ్, స్ప్లిట్ టైప్ సీట్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్, అండర్- బెల్లీ ఎగ్జాస్ట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు వస్తున్నాయి.
మరోవైపు కేటీఎం ఆర్సీ 390లో ఫ్యుయెల్ ట్యాంక్ షార్ప్‌గా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, డీఆర్ఎల్స్, స్ప్లిట్ సీట్స్, బోల్ట్- ఆన్ సబ్‌ఫ్రేమ్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్, ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తోంది.
ఈ రెండు బైక్స్‌లోనూ 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి.
ఈ రెండు బైక్స్‌లో ఉండే ఇంజిన్ వివరాలు..
Aprilia RS 457 price : అప్రిలియా ఆర్ఎస్ 457లో సరికొత్త 457 సీసీ, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్సీ, పారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక కేటీఎం బైక్‌లో 373 సీసీ, లిక్విడ్ కూల్డ్, డీఓఎహెచ్సీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 43 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు బైక్స్‌లో కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పిర్ క్లచ్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి వస్తున్నాయి.
ఈ రెండు బైక్స్ ధరల వివరాలు..
Aprilia RS 457 price in India : అప్రిలియా ఆర్ఎస్ 457 ఎక్స్‌షోరూం ధర రూ. 4.5లక్షలుగా ఉంటుందని అంచనా. 2023 కేటీఎం ఆర్సీ 390 ఎక్స్‌షోరూం ధర రూ. 3.18లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం