Aprilia Typhoon 125: అప్రిలియా లైనప్‍లో కొత్త స్కూటర్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే!
Aprilia Typhoon 125 Scooter: అప్రిలియా టైఫూన్ 125 స్కూటర్ ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుంది. అప్రిలియా ఎస్ఆర్ రేంజ్ రేంజ్‍లో ఇది ఉంటుంది.
Aprilia Typhoon 125 Scooter: అప్రిలియా ఎస్ఆర్ రేంజ్ బేస్‍గా కొత్త స్కూటర్‌ను భారత మార్కెట్‍లోకి తెస్తున్నట్టు పియాజియో ఇండియా (Piaggio India) ప్రకటించింది. అప్రిలియా టైఫూన్ 125 (Aprilia Typhoon 125) పేరుతో ఈ నయా స్కూటర్ రానుంది. ప్రస్తుతం ఉన్న స్ట్రామ్ 125కి రిప్లేస్‍మెంట్‍గా అప్‍గ్రేడ్‍లతో ఈ టైఫూన్ అడుగుపెట్టనుంది. మార్చిలో ఈ స్కూటర్ భారత్‍లో లాంచ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
అప్‍గ్రేడ్లతో భారత మార్కెట్‍లోకి..
Aprilia Typhoon 125 Scooter: గ్లోబల్‍గా ఇప్పటికే అప్రిలియా టైఫూన్ స్కూటర్ అమ్మకాలను పియాజియో చేసింది. అయితే, ఇండియాకు తీసుకొచ్చే వెర్షన్ స్టైలింగ్, ఫీచర్లు, హార్డ్ వేర్ విషయాల్లో కొన్ని కీలకమైన అప్‍గ్రేడ్లను కలిగి ఉండనుంది. 125 cc సామర్థ్యమున్న ఇంజిన్‍తో అప్రిలియా టైఫూన్ రానుంది. ఇండియాలో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్ననేపథ్యంలో అప్రిలియాతో పాటు మరిన్ని కీలకమైన ప్రకటనలు, ప్రొడక్ట్ అప్‍గ్రేడ్లను పియాజియో చేసే అవకాశం ఉంది.
ఈ ఫీచర్లతో..
Aprilia Typhoon 125 Scooter: డిజిటల్ కన్సోల్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్, కాంబీ బ్రేకింగ్ సహా మరిన్ని ఫీచర్లతో అప్రిలియా టైఫూన్ 125 రానుంది. కొత్త ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఐ-గెట్ యూరో5 ఇంజిన్‍ను ఈ స్కూటర్ కలిగి ఉండనుంది. కొత్త రూల్స్‌కు తుదిగడువుగా ఉన్న ఏప్రిల్ 1వ తేదీలోగా పియాజియో నుంచి ఉన్న పూర్తి స్కూటర్ లైనప్ ఐ-గెట్ యూరో5 ఇంజిన్లను పొందనున్నాయి. మెరుగైన యాక్సలరేషన్, తక్కువ ఉద్ఘారాలతో పాటు మరిన్ని పర్ఫార్మెన్స్ ఇంప్రూమెంట్లు ఈ కొత్త తరహా ఇంజిన్ల ద్వారా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
Aprilia Typhoon 125 Scooter: ప్రస్తుతం అప్రిలియా ఎస్ఈ 125 ధర రూ.లక్షా 10 వేలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాగా, అప్రిలియా టైఫూన్ కూడా సుమారు ఇదే ధరకు లాంచ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. టైఫూన్ స్కూటర్ ప్రారంభ ధర కూడా రూ.లక్షా 10వేలు ఉండొచ్చు.
ఈ ఏడాదిలోనే ఎంట్రీ లెవెల్‍లో బైక్‍ను లాంచ్ చేయాలని పియోజియో ప్రణాళిక రచించుకుంది. ఇక ప్రీమియమ్ రేంజ్‍లో ఆర్ఎస్440 (RS440) స్పోర్ట్స్ బైక్‍ను తీసుకొచ్చేందుకు పియాజియో రెడీ అయింది. బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, కేటీఎం ఆర్సీ 390, కవాసాకి నింజా 300 బైక్‍లకు పోటీగా దీన్ని తీసుకురానుంది. రానున్న వారాల్లో పియాజియో నుంచి మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్