తెలుగు న్యూస్ / ఫోటో /
2023 Honda Activa 125: 2023 హోండా యాక్టివా 125 స్కూటర్లు: ఫొటోలతో పాటు వివరాలు
- Honda Activa 125 H-Smart: 2023 హోండా యాక్టివా 125 లైనప్ ఇటీవల లాంచ్ అయింది. ఓబీడీ-2 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‍తో ఈ కొత్త వెర్షన్ స్కూటర్లు వచ్చాయి. దీంట్లో యాక్టివా 125 హెచ్-స్మార్ట్ టాప్ ఎండ్ వేరియంట్‍గా ఉంది. ఈ 2023 వెర్షన్ యాక్టివా 125 స్కూటర్ల వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.
- Honda Activa 125 H-Smart: 2023 హోండా యాక్టివా 125 లైనప్ ఇటీవల లాంచ్ అయింది. ఓబీడీ-2 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‍తో ఈ కొత్త వెర్షన్ స్కూటర్లు వచ్చాయి. దీంట్లో యాక్టివా 125 హెచ్-స్మార్ట్ టాప్ ఎండ్ వేరియంట్‍గా ఉంది. ఈ 2023 వెర్షన్ యాక్టివా 125 స్కూటర్ల వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.
(1 / 11)
2023 యాక్టివా 125 స్కూటర్ లైనప్‍ను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా (HMSI) ఇటీవల లాంచ్ చేసింది. ఓబీడీ2 ప్రమాణాలకు అనుగుణమైన 125 సీసీ ఇంజిన్‍తో వీటిని అప్‍గ్రేడ్ చేసింది. ఇందులో హెచ్-స్మార్ట్ వేరియంట్ కూడా ఉంది.
(2 / 11)
గత యాక్టివా మోడళ్లతో పోలిస్తే 2023 యాక్టివా 125 స్కూటర్ల డిజైన్‍లో పెద్దగా మార్పులు లేవు. సైడ్ ప్యానెళ్లపై క్రోమ్ గార్నిష్ కాస్త మారింది. దీంతో ఈ స్కూటర్ల లుక్ మరింత ప్రీమియమ్‍గా మారింది.
(3 / 11)
కొత్త హోండా యాక్టివా 125 కూడా ఎల్ఈడీ హెచ్‍ల్యాంప్‍లను కలిగి ఉంది. ముందు, వెనుక హలోజెన్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇక ప్రధానమైన మార్పులు ఏమీ లేవు.
(5 / 11)
2023 హోండా యాక్టివా 125 లైనప్‍లో టాప్ ఎండ్ వేరియంట్లు ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‍లను కలిగి ఉన్నాయి. ప్రారంభ వేరియంట్లకు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
(8 / 11)
ఐదు కలర్ ఆప్షన్‍లతో హోండా యాక్టివా 125 వస్తోంది. పర్ల్ నైట్ స్టార్ట్ బ్లాక్, హెవీ గార్లిక్ మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీసియస్ వైట్, మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ కలర్లు అందుబాటులో ఉన్నాయి.
(9 / 11)
టోటల్ ట్రిప్, క్లాక్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ సహా ఇతర ఫ్యుయల్ ఎఫెషియెన్సీ సమాచారం లాంటివి ఈ స్కూటర్ స్మాల్ స్క్రీన్ చూపిస్తుంది.
(10 / 11)
హెచ్-స్మార్ట్ వేరియంట్‍కు సాధారణ కీ హోల్ ఉండదు. దీని నాబ్‍ను ఓనర్ ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు