తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Mavrick Scrambler 440 : హీరో మావ్రిక్​ 440 స్క్రాంబ్లర్​.. మరో స్టైలిష్​ బైక్​ వచ్చేస్తోంది!

Hero Mavrick Scrambler 440 : హీరో మావ్రిక్​ 440 స్క్రాంబ్లర్​.. మరో స్టైలిష్​ బైక్​ వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu

20 April 2024, 6:43 IST

google News
    • Hero Mavrick Scrambler 440 : హీరో మోటోకార్ప్​ నుంచి మరో కొత్త, స్టైలిష్​ బైక్​ రాబోతోందా? అది మావ్రిక్​ స్క్రాంబ్లర్​ 440 అవుతుందా? 
మావ్రిక్​ స్క్రాంబ్లర్​ 440 పై హీరో సంస్థ ఫోకస్​ చేసిందా?
మావ్రిక్​ స్క్రాంబ్లర్​ 440 పై హీరో సంస్థ ఫోకస్​ చేసిందా?

మావ్రిక్​ స్క్రాంబ్లర్​ 440 పై హీరో సంస్థ ఫోకస్​ చేసిందా?

Hero Mavrick Scrambler 440 : హీరో మోటోకార్ప్ సంస్థ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఫ్లాగ్​షిప్​ బైక్​ అయిన మావ్రిక్ 440ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది హార్లే-డేవిడ్​సన్​తో కలిసి అభివృద్ధి చేసిన బైక్​. ఫలితంగా ఎక్స్​440తో దీనికి చాలా పోలికలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. హీరో మోటోకార్ప్ సంస్థ.. 'మావ్రిక్ 440 స్క్రాంబ్లర్' అనే పేరును ట్రేడ్​మార్క్​ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకుంది. ఇది.. మావ్రిక్​ 440కి మరో వేరియంట్​ లేదా వర్షెన్​ అని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హీరో మావ్రిక్​ 440 స్క్రాంబ్లర్​..

స్క్రాంబ్లర్ వెర్షన్ కోసం, హీరో మోటోకార్ప్ బైక్​లో కాస్మొటిక్స్​ పరంగా ఎక్కువ మార్పులు కనిపించొచ్చు. డ్యూయెల్ పర్పస్ టైర్లు, వెడల్పాటి హ్యాండిల్ బార్, కొత్త సీటు, విభిన్న ఫుట్ పెగ్​ల సెట్​ను ఆశించొచ్చు. సాధారణంగా స్క్రాంబ్లర్లు 19 ఇంచ్​ ఫ్రంట్ వీల్​తో వస్తాయి. కాబట్టి హీరో కొత్త బైక్​ వీల్ సైజును కూడా మార్చే అవకాశం ఉంది. హ్యాండ్ గార్డులు, వేరే మడ్​గార్డ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఇతర మార్పులు కూడా ఉండవచ్చు.

ఈ మోటార్ సైకిల్ 440 సీసీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్​పీఎమ్ వద్ద గరిష్టంగా 27 బీహెచ్​పీ పవర్.. 4,000 ఆర్​పీఎమ్ వద్ద 36 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్స్ 440 టార్క్ 2 ఎన్ఎమ్ కంటే కొద్దిగా తక్కువ. తక్కువ-ఎండ్ టార్క్​కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇంజిన్​ని ట్యూన్ చేయడం జరిగింది. ఇది సిటీ ట్రావెలింగ్​ హైవే ప్రయాణాలకు సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6-స్పీడ్ గేర్ బాక్స్ తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

Hero Mavrick 440 : కొత్త హీరో మావ్రిక్​ 440 స్క్రాంబ్లర్​ ఫీచర్స్​లో కూడా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. ఫీచర్ సెట్ అలాగే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, అన్ని ఎల్​ఈడీ లైటింగ్​తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్​ని ఎక్స్​పెక్ట్​ చేయవచ్చు. ఈ బైక్​ ఒక స్క్రాంబ్లర్​ కాబట్టి.. దీనికి స్విచ్చెబుల్ ఏబిఎస్ ను యాడ్​ చేసే అవకాశం లేకపోలేదు.

Hero Mavrick 440 price in Hyderabad : అయితే.. ట్రేడ్​మార్క్​ దాఖలు చేసినంత మాత్రాన.. ఆ బైక్​ లాంచ్​ అవుతుందని కచ్చితంగా చెప్పడానికి లేదు. కొన్నిసార్లు, తయారీదారులు.. పేరుపై హక్కులను పొందుతారు, తద్వారా మరెవరూ దానిని ఉపయోగించలేరు. దానిని వాడటం, వాడకపోవడం ఆ తర్వాత వారి ఇష్టం.

తదుపరి వ్యాసం