తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Mavrick 440 : హీరో మావ్రిక్​ 440.. ప్రీమియం బైక్​ ధర ఎంతంటే..

Hero Mavrick 440 : హీరో మావ్రిక్​ 440.. ప్రీమియం బైక్​ ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

17 February 2024, 10:43 IST

google News
    • Hero Mavrick 440 price : హీరో మోటోకార్ప్​ సంస్థ.. సరికొత్త బైక్​ని తీసుకొచ్చింది. ఈ హీరో మావ్రిక్​ 440 ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మార్కెట్​లోకి కొత్త బైక్​.. హీరో మావ్రిక్​ 440 ధర ఎంతంటే!
మార్కెట్​లోకి కొత్త బైక్​.. హీరో మావ్రిక్​ 440 ధర ఎంతంటే!

మార్కెట్​లోకి కొత్త బైక్​.. హీరో మావ్రిక్​ 440 ధర ఎంతంటే!

Hero Mavrick 440 review : ఇండియాలో దిగ్గజ్​ 2 వీలర్​ వెహికిల్స్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​.. ఇటీవలే సరికొత్త బైక్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దాని పేరు హీరో మావ్రిక్​ 440. ఇది స్టైలిష్​గాను, పవర్​ఫుల్​గాను ఉంది. ఈ వెహికిల్​పై కస్టమర్స్​లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త బైక్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో మావ్రిక్ ​440- ఫీచర్స్​ ఇవే..

హీరో మావ్రిక్​ 440లో.. నియో రెట్రో ఎలిమెంట్స్​తో కూడిన మస్క్యులర్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉంటుంది. ఫ్యుయెల్​ ట్యాంక్, ఫెండర్స్​​ కోసం మెటల్​ని వాడింది హీరో మోటోకార్ప్​. ఎల్​ఈడీ లైటింగ్​ వస్తోంది. డిజిటల్​ స్పీడోమీటర్​, బ్లూటూత్​ కనెక్టివిటీ వంటివి కూడా ఉన్నాయి.

Hero Mavrick 440 price in India : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​400లో ఉండే ఇంజిన్​నే హీరో మావ్రిక్​ 440లో కూడా ఉపయోగించారు. ఇది.. ఒక 440సీసీ, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​. ఇది.. 27 హెచ్​పీ పవర్​ని, 36 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​, స్లిప్​ అండ్​ అసిస్ట్​ క్లచ్​ ఉన్నాయి.

హీరో మావ్రిక్​ 440- ధర ఎంతంటే..

హీరో మావ్రిక్​ 440 ఒక ఫ్లాగ్​షిప్​ బైక్​. మూడు వేరియంట్స్​లో ఇది అందుబాటులోకి వచ్చింది. అవి.. బేస్​, మిడ్​, టాప్​. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా.. రూ. 1.99లక్షలు, రూ. 2.14లక్షలు, రూ. 2.24లక్షలు. ఈ బైక్​కి చెందిన ప్రీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 5వేల టోకెన్​ అమౌంట్​తో ఈ బైక్​ని బుక్​ చేసుకోవచ్చు.

హీరో మావ్రిక్​ 440 బైక్​ డెలివరీని ఏప్రిల్​లో ప్రారంభించాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. అంతేకాకుండా.. 'వెల్కమ్​ టు మావ్రిక్​ క్లబ్​ ఆఫర్​'ని కూడా లాంచ్​ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. రూ. 10వేలు విలువ చేసే కస్టమైజ్​డ్​ మావ్రిక్​ కిట్​ యాక్ససరీస్​ని ఇవ్వాలని చూస్తోంది. అయితే.. మార్చ్​ 15లోపు హీరో మావ్రిక్​ 440ని బుక్​ చేసుకున్న వారికే.. ఈ ఫెసిలిటీ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Hero Mavrick 440 speed : హీరో మోటోకార్ప్​ చరితరలోనే మోస్ట్​ ప్రీమియం మోటార్​సైకిల్​ ఈ హీరో మావ్రిక్​ 440.

"మావ్రిక్​ 440తో.. ప్రీమియం బైక్స్​లో మా జర్నీ కొనసాగుతోంది. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాము. ఇది హార్లీ డేవిడ్​సన్​ 400ని పోలి ఉన్నా.. ఈ బైక్​ ఓ యూత్​ఫుల్​ మాడర్న్​ రోడ్​స్ర్​. ప్రీమియం సెగ్మెంట్​లో ఆధిపత్యం కోసం మేము చేస్తున్న ప్రయత్నం.. ఈ బైక్​తో కొనసాగుతుందని ఆశిస్తున్నాము," అని హీరో మోటోకార్ప్​ సీఈఓ నిరంజన్​ గుప్తా తెలిపారు.

తదుపరి వ్యాసం