Kawasaki new W175 Street: అందుబాటు ధరలో, రెట్రో లుక్ లో కవాసకి డబ్ల్యూ 175 స్ట్రీట్..-india bike week 2023 kawasaki launches new w175 street in india at 1 35 lakh rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kawasaki New W175 Street: అందుబాటు ధరలో, రెట్రో లుక్ లో కవాసకి డబ్ల్యూ 175 స్ట్రీట్..

Kawasaki new W175 Street: అందుబాటు ధరలో, రెట్రో లుక్ లో కవాసకి డబ్ల్యూ 175 స్ట్రీట్..

HT Telugu Desk HT Telugu
Dec 09, 2023 03:46 PM IST

Kawasaki new W175 Street: కవాసకి భారతదేశంలో డబ్ల్యూ175 స్ట్రీట్‌ బైక్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.

కవాసకి డబ్ల్యూ 175 స్ట్రీట్‌ బైక్
కవాసకి డబ్ల్యూ 175 స్ట్రీట్‌ బైక్

Kawasaki new W175 Street: కవాసకి కొత్త డబ్ల్యూ175 స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా బైక్ వీక్ 2023 (India Bike Week 2023)లో దీన్ని లాంచ్ చేశారు. ఈ మోటార్‌సైకిల్ మొదటి చూపులోనే ఆకర్షించేలా రెట్రో-క్లాసిక్ స్టైల్‌తో వస్తుంది. ఇందులో శక్తివంతమైన 177 cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ ను అమర్చారు. ఇది ఇండియాలోని కవాసకి మోటార్‌సైకిళ్లలో అత్యంత చవకైన మోడల్‌.

ఈ నెలలోనే డెలివరీలు..

ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలను కూడా ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ బైక్ పూర్తిగా భారతీయుల కోసం రూపొందిన భారత్ లోనే తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ అని జపాన్ కుచెందిన కవాసకి చెబుతోంది. ఈ బైక్ డిజైన్ ను రెట్రో లుక్ లో రూపొందించారు. కవాసకి W175 స్ట్రీట్ బైక్ రెట్రో-థీమ్ సర్క్యులర్ మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది, దీనికి అదనంగా ఆకర్షణీయమైన క్రోమ్ బెజెల్‌ ఉంటుంది.

రెండు రంగుల్లో..

ఈ కవాసకి W175 స్ట్రీట్ బైక్ క్యాండీ ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూన్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ న్యూ W175 స్ట్రీట్ మోటార్‌సైకిల్ కవాసకి పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న W175కి అదనంగా చేరింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న డబ్ల్యూ 175 మోడల్ రూ. 1.47 లక్షల ఎక్స్ షో రూమ్ ధరతో వస్తుంది. అంటే, లేటెస్ట్ W175, ఇప్పటికే మార్కెట్లో ఉన్న W175 మోడల్ కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. లేటెస్ట్ W175 బైక్ లో సెమీ డిజిటల్ రెట్రో థీమ్డ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు.

అలాయ్ వీల్స్ తో..

ఈ లేటెస్ట్ కవాసకి డబ్ల్యూ 175 కు అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి. ఇందులో సింగిల్-ఛానల్ ABS తో 270 mm ఫ్రంట్ డిస్క్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్-షాక్ రియర్ సస్పెన్షన్‌ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ లో 177 సీసీ సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 7,000 rpm వద్ద 12.82 bhp గరిష్ట శక్తిని, 6,000 rpm వద్ద 13.3 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయగలదు.

Whats_app_banner