Salaar Prabhas Bike: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ మీకు కావాలా.. అయితే ఈ పని చేయండి-win salaar prabhas bike watch the movie on star maa and get a chance to win the iconic royal enfeild bike ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Prabhas Bike: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ మీకు కావాలా.. అయితే ఈ పని చేయండి

Salaar Prabhas Bike: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ మీకు కావాలా.. అయితే ఈ పని చేయండి

Hari Prasad S HT Telugu

Salaar Prabhas Bike: ప్రభాస్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది సలార్ మూవీని నిర్మించిన హోంబలె ఫిల్మ్స్. ఈ మూవీలో ప్రభాస్ వాడినటువంటి బైక్ ను సొంతం చేసుకునే ఆఫర్ అది.

సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ మీకు కావాలా.. అయితే ఈ పని చేయండి

Salaar Prabhas Bike: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతున్న సంగతి తెలుసు కదా. గతేడాది డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ థియేటర్లు, ఓటీటీల్లో సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే టీవీలో ఈ సినిమా చూస్తూనే అందులో ప్రభాస్ వాడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్ గెలుచుకునే అవకాశం మేకర్స్ కల్పిస్తున్నారు.

సలార్ ప్రభాస్ బైక్ కావాలా?

ప్రభాస్ నటించిన సలార్ సీజ్‌ఫైర్ మూవీ ఆదివారం (ఏప్రిల్ 21) స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకూ కొనసాగనుంది. అయితే ఈ రెండున్నర గంటల గ్యాప్ లోనే ప్రభాస్ ఈ సినిమాలో నడిపినటువంటి బైక్ ను ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు.

ఈ విషయాన్ని సలార్ మూవీని నిర్మించిన హోంబలె ఫిల్మ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ బైక్ గెలుచుకోవాలంటే ఏం చేయాలో కూడా ఆ ట్వీట్ లో నిర్మాణ సంస్థ వివరించింది. మూవీ టెలికాస్ట్ అవుతున్న సందర్భంలో మధ్యమధ్యలో స్క్రీన్ పై వచ్చే బైక్ ఇమేజ్/బగ్ ఎన్నిసార్లు వస్తుందో చూడటమే ప్రేక్షకులు చేయాల్సిన పని.

బైక్ ఇలా గెలుచుకోండి

ప్రభాస్ ఉపయోగించినటువంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎలా గెలవాలో చెబుతూ హోంబలె ఫిల్మ్స్ ఈ ట్వీట్ చేసింది. "సలార్ సీజ్‌ఫైర్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ ను మీరు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. సినిమా టెలికాస్ట్ అవుతున్న 5.30 నుంచి 8 గంటల మధ్యలో స్క్రీన్ కు ఎడమవైపు వచ్చి వెళ్లే బైక్ ఇమేజ్/బగ్ ఎన్నిసార్లు కనిపించిందో మీకు లెక్కపెట్టాలి.

తర్వాత ఎస్సెమ్మెస్ లైన్లు ఓపెన్ అవుతాయి. అప్పుడు 9222211199 నంబర్ కు SALAAR <బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ నంబరు> వేసి పంపించాలి. ఎస్సెమ్మెస్ లైన్లు ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి" అని హోంబలె ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

అయితే దీనికోసం చాలా పెద్ద నియమ నిబంధనలనే విధించారు. ఆ లిస్టు మొత్తానికి సంబంధించిన లింకును కూడా ఈ ట్వీట్లోనే ఉంచారు. ఇండియాకు చెందిన వారే అయి ఉండాలి.. 18 ఏళ్ల పైబడి ఉండాలిలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయి.

థియేటర్లలో రిలీజై నాలుగు నెలల తర్వాత సలార్ మూవీ టీవీలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా రానుంది.

సలార్ మూవీలో దేవ అనే పాత్రలో ప్రభాస్ నటించగా.. మొదట ప్రాణ మిత్రుడిగా ఉండి శత్రువుగా మారిన వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి పోటీ ఎదురవడంతో ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.