Best Samsung smartphones under 50000 : రూ. 50వేలలోపు.. ది బెస్ట్ శాంసంగ్ ఫోన్స్ ఇవే!
16 January 2023, 8:26 IST
- Best Samsung smartphones under 50000 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే.. రూ.50వేల బడ్జెట్లో ది బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 50వేలలోపు.. ది బెస్ట్ శాంసంగ్ ఫోన్స్ ఇవే!
Best Samsung smartphones under 50000 : రూ. 50వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం! ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో.. రూ. 50వేలలోపు లభిస్తున్న ది బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం..
శాంసంగ్ గ్యాలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ..
Samsung Galaxy S21 FE 5G price : ఇందులో 6.4 ఇంచ్ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర రూ. 74,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 53శాతం డిస్కౌంట్లో ఇది రూ. 34,999కే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ఈ డివైజ్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫలితంగా ధర మరింత దిగొస్తుంది.
శాంసంగ్ గ్యాలెక్సీ ఎం53 5జీ..
Samsung Galaxy M53 5G : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30,999గా ఉంది. ఈ మోడల్‌పై ఎలాంటి డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ లేవు. కానీ.. బ్యంక్ ఆఫర్స్ కింద ధరను తగ్గించుకోవచ్చు. ఇందులో 6.7 ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ73 5జీ..
Samsung Galaxy A73 5G : 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ శాంసంగ్ గ్యాలెక్సీ ఏ73 5జీ వాస్తవ ధర రూ. 47,490. 11శాతం డిస్కౌంట్లో ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 41,999కే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 22,000 తగ్గించుకోవచ్చు! బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండటం విశేషం. ఇందులో 6.7ఇంచ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ...
Samsung Galaxy Z flip 3 5G features : 47శాతం డిస్కౌంట్లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 49,925కే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 95,999. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 25వేల తగ్గింపు కూడా ఉంది. ఇందులో 6.7 ఇంచ్ డిస్ప్లే, డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ52ఎస్ 5జీ..
Samsung Galazy A52s 5G specifications : ఈ 6జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,990గా ఉంది. ఈ మోడల్‌పై ఎలాంటి డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇవ్వడం లేదు. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో 6.5ఇంచ్ డిస్ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.