తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Council Meeting: గుడ్ న్యూస్.. కేన్సర్ ఔషధాలు సహా ఈ ఉత్పత్తులపై ధరలు తగ్గాయి..

GST council meeting: గుడ్ న్యూస్.. కేన్సర్ ఔషధాలు సహా ఈ ఉత్పత్తులపై ధరలు తగ్గాయి..

Sudarshan V HT Telugu

10 September 2024, 18:27 IST

google News
  • GST council meeting: పలు ముఖ్యమైన ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వాటిలో కేన్సర్ మందులు, నమ్ కీన్స్, హెలికాప్టర్ ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. కేన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులపై ధరలు తగ్గాయి..
గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులపై ధరలు తగ్గాయి..

గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులపై ధరలు తగ్గాయి..

GST council meeting: 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత పలు వస్తువులు, సేవలపై పన్ను తగ్గింపును జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇకపై చౌకగా లభించే వస్తువుల జాబితా ఇక్కడ ఉంది.

వీటి ధరలు తగ్గాయి..

1. క్యాన్సర్ మందులు: కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రాస్టుజుమాబ్ డెరుక్స్టెకాన్ (Trastuzumab Deruxtecan), ఒసిమెర్టినిబ్ (, Osimertinib), డర్వాల్యుమాబ్ (Durvalumab) వంటి ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

2. నమ్కీన్లు, రుచికరమైన ఆహార ఉత్పత్తులు: నమ్కీన్, రుచికరమైన ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఫ్రై చేయని లేదా వండని స్నాక్ పెల్లెట్స్ పై 5 శాతం జీఎస్టీ రేటు కొనసాగుతుంది.

హెలికాప్టర్ ప్రయాణం: మతపరమైన, ఆధ్యాత్మిక పర్యటనల కోసం చేసే హెలికాప్టర్ ప్రయాణాలపై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. కేదార్ నాథ్ (KEDARNATH), బద్రీనాథ్ వంటి మతపరమైన పర్యటనల్లో ఉపయోగించే హెలికాప్టర్ సేవలపై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

4. కారు, మోటారుసైకిల్ సీట్లు: 9401 కంటే తక్కువ స్థాయిలో వర్గీకరించిన కారు సీట్లపై జీఎస్టీ (GST) రేటును 18 శాతం నుండి 28 శాతానికి పెంచారు. మోటారు కార్ల కార్ల సీట్లకు 28% యూనిఫామ్ రేటు వర్తిస్తుంది.

5. రీసెర్చ్ ఫండ్స్: ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలకు లభించే రీసెర్చ్ ఫండింగ్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలకు ఇది వర్తిస్తుంది.

తదుపరి వ్యాసం