Google pixel 8 vs iPhone 15 : గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15.. ఏది బెస్ట్?
06 October 2023, 10:10 IST
- Google pixel 8 vs iPhone 15 : గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15..
Google pixel 8 vs iPhone 15 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ మరింత పెరిగింది! గూగుల్ సంస్థ.. తన పిక్సెల్ 8 సిరీస్‌ని తాజాగా లాంచ్ చేయడం ఇందుకు కారణం. గత నెలలో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్‌కు ఇది గట్టిపోటీనిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15- స్పెసిఫికేషన్స్..
గూగుల్ పిక్సెల్ 8లో 6.2 ఇంచ్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ ఆక్టువా డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. 60 హెచ్‌జెడ్- 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇందులో అబ్సీడియన్, హాజెల్, రోస్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ గూగుల్ పిక్సెల్ 8లో టెన్సార్ జీ3 చిప్సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
Google pixel 8 price in India : ఇక ఐఫోన్ 15 విషయానికొస్తే.. ఇందులో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే లభిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేదు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వస్తోంది. బ్లాక్, యెల్లో, బ్లూ, గ్రీన్, పింక్ వంటి కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఏ16 బయోనిక్ ప్రాసెసర్ వస్తోంది. ఐఓఎస్17 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15- ఇతర ఫీచర్స్..
గూగుల్ పిక్సెల్ 8లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా-వైడ్ రేర్ కెమెరా సెటప్ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. 4,575 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 27వాట్ వయర్డ్, 18వాట్ వయర్లెస్ గూగుల్ పిక్సెల్ స్టాండ్ వస్తోంది. యూఎస్బీ- టైప్ సీ ఛార్జర్ లభిస్తుంది.
iPhone 15 price in India : ఇక ఐఫోన్ 15 విషయానికొస్తే.. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా-వైడ్ రేర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుంది. ఫేస్ఐడీ సెక్యూరిటీ వస్తోంది. 3,349ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 27వాట్ వయర్డ్, 15వాట్ మగ్సేఫ్ వయర్లెస్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. యూఎస్బీ- టైప్ సీ పోర్ట్ కూడా వస్తోంది.
గూగుల్ పిక్సెల్ 8 వర్సెస్ ఐఫోన్ 15- ధర..
Google pixel 8 features : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ప్రారంభ ధర రూ. 75,999. ఐఫోన్ 15 ప్రారంభ ధర 799 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ. 79,900.