Google Pixel 8 : అతి తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 8- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్!
28 September 2024, 9:47 IST
Google Pixel 8 Flipkart : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ రూ.35,000 కంటే తక్కువ డిస్కౌంట్‌కు లభిస్తోంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, టెన్సర్ జీ3 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్ప్లేతో రూ.40,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో ఒకటిగా ఇప్పుడు పిక్సెల్ 8 నిలిచింది.
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్..
గూగుల్ పిక్సెల్ 9 లాంచ్ అయినప్పటికీ, గూగుల్ పిక్సెల్ 8కి ఉన్న డిమాండ్ కొనసాగుతూనే ఉంది. చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 గ్యాడ్జెట్‌పై అతి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకు పడిపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ పిక్సెల్ 8 ధర రూ. 35వేలలోపు ఉంది. గూగుల్ జెమినీ ఆధారిత ఏఐ ఫీచర్లు, టెన్సర్ జీ2 చిప్సెట్ కలిగిన పిక్సెల్ 8 సిరీస్ మార్కెట్లో ఉత్తమ కెమెరా ఫోన్లలో ఒకటిగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఆఫర్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
పిక్సెల్ 8 ధర రూ.35,000 లోపే!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పిక్సెల్ 8 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించి పేమెంట్ చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.35,000 కంటే తక్కువకు పడిపోయింది.
తాజాగా భారీ ఆఫర్ పొందిన పిక్సెల్ 8ను వేరియంట్‌ని రూ.75,999 ధరకు గూగుల్ లాంచ్ చేసింది. కొత్త డిస్కౌంట్ ధరలో రూ.40,000 లోపు కొనుగోలు చేయడానికి ఇది బెస్ట్ డివైజ్! ముఖ్యంగా మీరు కెమెరాపై ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ డీల్‌ని మిస్స్ అవ్వకూడదు!
గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు..
గూగుల్ పిక్సెల్ 8లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 428 పిక్సెల్ డెన్సిటీతో 6.2 ఇంచ్ డిస్ప్లేని కలిగి ఉంది. పిక్సెల్ 8 స్క్రీన్ ఆకట్టుకునే 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రెంట్ అండ్ రేర్ రెండింటిలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 8 బలమైన కెమెరా పనితీరును అందిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ పీడీ వైడ్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 4,575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. పిక్సెల్ 8లో, దాని మునుపటి కంటే కొత్త ఫీచర్లను అందించింది గూగుల్. క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ధూళి అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ టెన్సర్ జీ3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. మునుపటి టెన్సర్ జీ2 తో పోలిస్తే వేగం, మెరుగైన సామర్థ్యం రెండింటినీ అందిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ని ఇందులో అందించారు.
8 నిమిషాల్లో ఐఫోన్ డెలివరీ..!
బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ మంచి జోరు మీద ఉంది! ఐఫోన్ 15ను ఆర్డర్ చేసిన ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేవలం 8 నిమిషాల్లోనే దాన్ని అందుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.