Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​- డేట్స్​, ఆఫర్స్​ వివరాలు..-flipkart big billion days sale 2024 dates product offers bank offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​- డేట్స్​, ఆఫర్స్​ వివరాలు..

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​- డేట్స్​, ఆఫర్స్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu
Sep 10, 2024 11:00 AM IST

Flipkart Big Billion Days Sale date : ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్​! ఈ మెగా సేల్​ డేట్​ని ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది.​ ఈ నేపథ్యంలో ఈ సేల్​లో ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​
ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​

ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 వచ్చేసింది! ఈ మెగా ఆఫర్​ సేల్​.. సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. దసరా దీపావళి పండుగ డిమాండ్ కోసం ఎలక్ట్రానిక్స్, స్మార్ట్​ఫోన్స్​తో సహా అనేక విభాగాలలో భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.

పండుగ సీజన్​లో తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూనే, వినియోగదారులు తమ పొదుపును పెంచుకోవడానికి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్​ డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, క్యాష్​బ్యాక్​ ఆఫర్లను కూడా ఫ్లిప్​కార్ట్​ అందిస్తోంది. అంతేకాదు ఫ్లిప్​కార్ట్​ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 29 నుంచే ఈ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్​పై పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024- ఆఫర్స్​ ఇవే!

వివరాలు
 
ముఖ్యమైన సమాచారం
 సేల్​ ప్రారంభంసెప్టెంబర్​ 30, 2024
 
ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ సబ్​స్క్రైబర్స్​కి సేల ప్రారంభంసెప్టెంబర్​ 29, 2024
 
ప్రాడక్ట్​ కేటగిరీలు- ఆఫర్స్​ (అంచనా)ఎలక్ట్రానిక్స్​- యాక్ససరీస్​ 50% to 80% off
స్మార్ట్​ టీవీలు, హోం అప్లియన్సెస్​ Up to 80% off
స్మార్ట్​ఫోన్స్​- మేజర్​ బ్రాండ్స్​పై డిస్కౌంట్స్​
బ్యాంక్​ ఆఫర్స్​
 
ఎంపిక చేసిన కార్డులపై ఇన్​స్టెంట్​ డిస్కౌంట్స్​
ప్రీమియం ప్రాడక్ట్స్​పై నో కాస్ట్​ ఈఎంఐ ఆప్షన్స్​
అదనపు సేవింగ్స్​క్యాష్​బ్యాక్​ ఆఫర్స్​
కూపాన్​ డిస్కౌంట్స్​

ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్..

ల్యాప్​టాప్​లు, హెడ్​ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, ఇతర టెక్ యాక్ససరీలతో సహా విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 50% నుండి 80% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు..

స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. కొన్ని ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు, 4కే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

నథింగ్, రియల్​మీ, ఎంఐ, ఇన్ఫినిక్స్ వంటి స్మార్ట్​ఫోన్స్​పై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే, అందుబాటులో ఉన్న పరిమిత ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్ఫోన్లపై కూడా మంచి డీల్స్​ని అందిస్తాయి.

అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్లు- ఎక్స్​ఛేంజ్​ డీల్స్ ఏమిటి?

ఎక్స్​క్లూజివ్ బ్యాంక్ ఆఫర్లు: ప్రముఖ బ్యాంకులతో ఎంపిక చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించినప్పుడు ఇన్​స్టెంట్​ డిస్కౌంట్లను పొందవచ్చు.

ఎక్స్​ఛేంజ్​ డీల్స్: కస్టమర్లు తమ పాత డివైజ్​లను స్మార్ట్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​తో కొత్త కొనుగోళ్లపై డిస్కౌంట్లు పొందొచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ: స్మార్ట్ టీవీలు లేదా ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ వంటి వస్తువులకు ఫ్లిప్​కార్ట్​ నో0 కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది. వినియోగదారులు ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా ఇన్​స్టాల్మెంట్స్​లో చెల్లించడానికి అనుమతిస్తుంది.

క్యాష్​బ్యాక్- కూపాన్​లు: వివిధ క్యాష్​బ్యాక్ ఆఫర్లు, కూపాన్ డిస్కౌంట్లు వినియోగదారుల పొదుపును మరింత పెంచుతాయి. వివిధ బడ్జెట్​లకు సరిపోయే సరసమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా?

1) ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్​షిప్ పొందండి..

ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్​షిప్ మీకు సేల్​కు ముందస్తు యక్సెస్​ని ఇస్తుంది. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్​ల వంటి ఎలక్ట్రానిక్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తుల విషయానికి వస్తే, టాప్ డీల్స్ పూర్తిగా అమ్ముడుపోవడానికి ముందు పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

2. ముందుగానే మీ షాపింగ్ విష్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి.

సేల్ ప్రారంభానికి ముందే షాపింగ్ విష్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి.

3) అన్ని వివరాలతో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి

ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మైక్రోసైట్్​ను అప్డేట్​లు రాబోయే డీల్స్, స్నీక్ పీక్స్ కోసం క్రమం తప్పకుండా సందర్శించండి. ఎందుకంటే ఫ్లిప్​కార్ట్ తరచుగా ఎక్స్​క్లూజివ్ డిస్కౌంట్లు, ఆఫర్లను వెల్లడిస్తుంది.

సంబంధిత కథనం