Flipkart sale: కేవలం 8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ!: ఫ్లిప్ కార్ట్ రికార్డు-iphone 15 delivered in just 8 minutes man shares awesome flipkart experience ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Sale: కేవలం 8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ!: ఫ్లిప్ కార్ట్ రికార్డు

Flipkart sale: కేవలం 8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ!: ఫ్లిప్ కార్ట్ రికార్డు

Sudarshan V HT Telugu
Sep 27, 2024 07:38 PM IST

ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సందర్భంగా ఐఫోన్ 15 డిస్కౌంట్ తో లభిస్తుంది. ఐఫోన్ 15 ను ఆర్డర్ చేసిన 8 నిమిషాలకే బెంగళూరులోని ఒక కస్టమర్ రిసీవ్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ
8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ (Bloomberg)

ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 భారతదేశంలో జోరుగా సాగుతున్నాయి. ఈ అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను భారతీయులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఐఫోన్లు నిమిషాల్లో వేలల్లో అమ్ముడవడం చూస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు ఐఫోన్ 15, గూగుల్ పిక్సెల్ 8 వంటి ఫోన్లను చాలా సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయగలుగుతున్నారు. డెలివరీని కూడా తొందరగానే పొందుతున్నారు. ఐఫోన్ 15ను ఆర్డర్ చేసిన ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేవలం 8 నిమిషాల్లోనే దాన్ని అందుకున్నాడు. ఎలాగో తెలుసుకోవడానికి చదవండి.

కేవలం 8 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ

బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ ఐఫోన్ 15ను ఫ్లిప్ కార్ట్ మినిట్స్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేశాడు. తను ఆర్డర్ చేసిన ఐఫోన్ 15ను ఆ కస్టమర్ కేవలం 8 నిమిషాల్లో అందుకున్నాడు. ఫ్లిప్ కార్ట్ మినిట్స్ సర్వీస్ ను బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సేవలతో పోల్చవచ్చు. ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం 8 నిమిషాల్లోనే ఐఫోన్ 15 వచ్చిందని, అద్భుతమైన డెలివరీ ఎక్స్ పీరియన్స్ లభించిందని ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘మీరు ఎక్కడికి వెళ్లినా, మీకు ఐఫోన్ (samsung), మాక్ బుక్ లేదా ఏదైనా తక్షణమే అవసరమైతే, మీరు దానిని కేవలం 8 నిమిషాల్లో పొందుతారు. చాలా థాంక్స్ ఫ్లిప్ కార్ట్!" అని స్పందించాడు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో చాలా డీల్స్

ఐఫోన్ 15 తో పాటు గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23) వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై, సీఎంఎఫ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ (2ఎ) వంటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో గొప్ప ఆఫర్లను చూడవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 (google pixel) స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్లను కలిపి సుమారు రూ.32,000 లకు లభిస్తుంది. ఇది దాని అద్భుతమైన సాఫ్ట్వేర్ మద్దతు, క్లాస్-లీడింగ్ స్టిల్ కెమెరా, కాంపాక్ట్ డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పిక్సెల్ 8తో పాటు, ఐఫోన్ 15 వంటి కాంపాక్ట్ డివైజ్ కోసం చూస్తున్నవారికి గెలాక్సీ ఎస్ 23 కూడా గొప్ప ఎంపిక. 6.1 అంగుళాల డిస్ ప్లేతో, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ కెమెరా సెటప్ తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అలరిస్తోంది.