మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. మరిచిపోయిన, క్లెయిమ్ చేయని ఖాతాల కోసం కొత్త ప్లాట్‌ఫామ్
18 December 2024, 8:07 IST
- MITRA For Mutual Funds : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్ చెప్పింది. MITRA పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుంది. దీనితో పాత ఇన్వెస్టర్లకు చాలా ప్రయోజనం ఉండనుంది.
MITRA పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకురానున్న సెబీ
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. దీని కింద పనిచేయని(నిద్రాణమైన), క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఖాతాలను గుర్తించడానికి కొత్త పోర్టల్ రానుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) మంగళవారం కొత్త ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. జనవరి 7 లోగా ప్రజల అభిప్రాయాలను కోరింది. ఈ మేరకు MITRA(Mutual Fund Investment Tracing and Retrieval Assistant) తీసుకువస్తుంది.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్(ఎంఐటీఆర్) పేరుతో ఈ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్(ఆర్టీఏ) అభివృద్ధి చేస్తుందని సెబీ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కనుగొనడానికి, ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా కేవైసీని నవీకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్ పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. అదే సమయంలో ఫ్లాడ్ సమస్యలను తగ్గించి సేఫ్టీగా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది.
క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను తగ్గించడానికి, పారదర్శక ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి ఇది ఉపయోగపడుతుంది. కంప్యూటర్ ఎడ్జ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (క్యామ్స్), కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే రెండు అర్హత కలిగిన ఆర్టీఏలు సంయుక్తంగా ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహించవచ్చు.
మ్యూచువల్ ఫండ్ ఖాతాల్లో గత పదేళ్లుగా ఎలాంటి లావాదేవీ జరగని, ఇన్వెస్టర్ క్లెయిమ్ చేసుకోని ఖాతాలను ఇన్‌యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు అంటారు. ప్రతిపాదిత పోర్టల్‌కు లింక్ చేసే అటువంటి ఖాతాల డేటాబేస్‌ను సెబీ తయారు చేస్తుంది. పెట్టుబడిదారులు తమ గుర్తింపును ధృవీకరించడం ద్వారా కోల్పోయిన ఖాతాను తిరిగి కనుగొంటారు.
దీని కోసం పెట్టుబడిదారుడు ఈ ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అవ్వాలి. అతని పాన్ నంబర్ లేదా ఇతర వివరాలను నమోదు చేయాలి. అప్పుడు సిస్టమ్ క్లెయిమ్ చేయని సమాచారాన్ని చూపిస్తుంది.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కొన్నిసార్లు తమ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నారని సెబీ తెలిపింది. కేవైసీ వివరాలు సరిగా లేక ఫిజికల్ రూపంలో ఇన్వెస్ట్ చేయడమే ఇందుకు కారణం. పాన్, ఇమెయిల్ ఐడీ, చెల్లుబాటు అయ్యే చిరునామా, ఖాతాల వివరాలు కూడా కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. అందువల్ల ఈ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు పనిచేయవు. అవి మోసపూరిత ఎన్‌క్యాష్‌మెంట్‌కు గురవుతాయి.
MITRA ప్లాట్‌ఫామ్ పని చేయని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ డేటాను తయారుచేస్తుంది. ఇన్వెస్టర్లు ఎంత పాతవారైనా తమ పెట్టుబడులను సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. ఈ సర్వీస్ డిజిటల్‌గా ఉంటుంది. పెట్టుబడిదారులు ఎప్పుడైనా వారి ఖాతా స్టేటస్ చెక్ చేయడానికి అనుమతిస్తుంది. ఇన్‌యాక్టివ్ అకౌంట్లను మోసాలకు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి రిస్క్‌లను ఈ ప్లాట్ ఫామ్ తగ్గిస్తుంది. క్లెయిమ్ చేయని ఖాతాల్లో ఉన్న నిధులను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.
టాపిక్