Free Gas Cylinder eKYC:ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో-ap free gas cylinder scheme bookings open how to do ekyc process npci linking list in sachivalaya ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Free Gas Cylinder Ekyc:ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో

Free Gas Cylinder eKYC:ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో

Bandaru Satyaprasad HT Telugu
Oct 30, 2024 10:19 AM IST

AP Free Gas Cylinder eKYC : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలండర్ పథకం గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పొందాలంటే లబ్దిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి.

ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో
ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) బుకింగ్ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి లబ్దిదారులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు బంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో గ్యాస్ డీలర్ ను సంప్రదించి ఈ-కేవైసీ చేయించుకోవాలి. అనతరం గ్యాస్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. దీంతో మీరు ఉచిత గ్యాస్ పథకానికి అర్హులుగా నిర్థారించుకోవచ్చు. అయితే లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో డబ్బును ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులకు ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి ఫోన్ చేయవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్‌ను మార్చి31వ తేదీలోపు, రెండోది జులై 31, మూడోది నవంబర్ 30లోపు సిలిండర్లను పొందవచ్చు.

ఈ-కేవైసీ ఎలా చేయించాలి?

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించాలి. అందుకుగాను లబ్దిదారులు తమ గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ కనెక్షన్ బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు(బియ్యం కార్డు)తో ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారి డేటా 24 నుంచి 48 గంటలలో అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీ అప్డేట్ అయిన తర్వాత లబ్దిదారుడి మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అనంతరం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ-కేవైసీ చేసినప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరిట ఉంటే వాళ్లే గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. దీంతో పాటు లబ్దిదారుడు బ్యాంక్ ఖాతాకి NPCI లింక్ చేసుకోవాలి. అంటే గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలి. ఎన్పీసీఐ లింక్ బ్యాంకుల్లో చేస్తారు.

బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ తప్పనిసరి

అలాగే గ్రామాల వారీగా ఎన్పీసీఐ లింక్(బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్) చేసుకోవాల్సిన వారి వివరాలు సచివాలయాల్లో ఉందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదిస్తే వారు బ్యాంకు ఖాతా లింక్ కానీ వారి వివరాలు తెలియజేస్తారు. ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటే ఈ-కేవైసీతో పాటు ఎన్పీసీఐ కూడా పూర్తి చేసుకుంటే...గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో మీ ఖాతాల్లో రూ.851 సబ్సిడీ నగదు జమ అవుతుంది.

నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దీపం-2 పథకం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కూటమి పార్టీల ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఈదులపురంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబంలోని మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Whats_app_banner