తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : మళ్లీ పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Gold and silver rates today : మళ్లీ పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

21 January 2024, 9:45 IST

google News
    • Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (AFP)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 57,800కి చేరింది. శనివారం ఈ ధర రూ. 57,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,000 పెరిగి, రూ. 5,78,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,050కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1,000 పెరిగి.. రూ. 6,30,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,550గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,050గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

దిగొచ్చిన వెండి ధర..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,550గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 75,500కి చేరింది. శనివారం ఈ ధర రూ. 75,700గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,500.. బెంగళూరులో రూ. 73,250గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 320 తగ్గి.. రూ 24,060కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,380గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,060గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం