తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today : రూ. 55వేల దిగువకు పసిడి ధర.. కొనుగోళ్లకు టైమ్​ వచ్చింది!

Gold and silver rate today : రూ. 55వేల దిగువకు పసిడి ధర.. కొనుగోళ్లకు టైమ్​ వచ్చింది!

Sharath Chitturi HT Telugu

16 June 2023, 5:48 IST

google News
    • Gold and silver rate today : దేశంలో పసిడి ధరలు రూ. 55వేల దిగువకు చేరాయి. వెండి ధరలు భారీగా పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (MINT_PRINT)

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 దిగొచ్చి.. రూ. 54,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,050గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3500 తగ్గి, రూ. 5,479,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,470గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 తగ్గి.. రూ. 59,670కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,050గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3800 దిగొచ్చి.. రూ. 5,96,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,967గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,820గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 59,670గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,720గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 59,720గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల వ్యవహారం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,310గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 900 తగ్గి.. రూ. 73,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,100.. బెంగళూరులో రూ. 74,250గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 280 తగ్గి.. రూ 25,610కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,890గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,610గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం