తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

Gold and silver rate today : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

HT Telugu Desk HT Telugu

15 June 2023, 9:46 IST

google News
    • Gold and silver rate today : గురువారం, జూన్ 15న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,050 చేరింది. మంగళవారం ఈ ధర రూ. 55,400గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,50,500 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,505గా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT)

ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rate today : గురువారం, జూన్ 15న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,050 చేరింది. మంగళవారం ఈ ధర రూ. 55,400గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,50,500 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,505గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

24 క్యారట్ గోల్డ్

24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర గురువారం రూ. రూ. 60,050 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,00,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,005 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,200గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,200గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,050గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,550గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,100 గా ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,050గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంటాయి.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,400గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 74,000కి చేరింది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,000.. బెంగళూరులో రూ. 75,250గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ.280 తగ్గి.. రూ 25,610కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 25,810గా ఉండేది. ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర(10గ్రాములు) రూ. 25,610గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం