తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Gold price today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

HT Telugu Desk HT Telugu

21 March 2024, 8:55 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: iStock)

ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 20 తగ్గి.. రూ. 60,790 కి చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 60,810 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 200 తగ్గి, రూ. 6,07,900 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,079 గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Facebook, Instagram down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్; నెటిజన్స్ ఫైర్..

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర కూడా రూ. 20 తగ్గి రూ. 66,320 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 66,340 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,63,200 కి చేరింది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,940 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,470 గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,790 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,320 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,410 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,960 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,790 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,320 గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,790 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,320 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,840గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,370గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,790గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,320 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

దేశ వ్యాప్తంగా గురువారం వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గినవి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10 తగ్గి రూ. 7690 కి చేరుకుంది. ఈ ధర బుధవారం రూ. 7700 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,900 కి చేరింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,900.. బెంగళూరులో రూ. 75,400గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం కూడా భారీగా తగ్గినవి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 610 తగ్గి రూ. 23, 700 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 24,310 గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 23,710 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం