Gold price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు..-gold and silver prices today on 20 03 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 20-03-2024 : Check Latest Rates In Your City

Gold price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు..

HT Telugu Desk HT Telugu
Mar 20, 2024 09:24 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 440 పెరిగి.. రూ. 60,810 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 60,370 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,08,100 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,810 గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 480 పెరిగి, రూ. 66,340 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 65,860 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,63,400 కి చేరింది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,960 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,490గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,340 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,360గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,810 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,340 గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,340 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,860గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,390గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,340గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 50 పెరిగి రూ. 7740 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 7,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 77,400 కి చేరింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,400.. బెంగళూరులో రూ. 75,800గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం తగ్గినవి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 410 తగ్గి రూ. 24,310 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 24,720 గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,310 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel