తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 1లక్షకు చేరువలో వెండి ధర- పసిడి రేటు ఎంతంటే..

Gold and silver prices today : రూ. 1లక్షకు చేరువలో వెండి ధర- పసిడి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

06 July 2024, 5:46 IST

google News
    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు పడ్డాయి. వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,990కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,69,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,699గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 73,080కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,090గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,30,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,308గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,140గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,230గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,080గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,740గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,990గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,080గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,990గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,080గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,040గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,130గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,990గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,080గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెడి రూ. 9,330గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 93,300కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 93,200గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 97,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 93,200.. బెంగళూరులో రూ. 92,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 120 తగ్గి.. రూ 26,810కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,930గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,810గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం