తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 1లక్షకు చేరువలో వెండి రేటు- బంగారం ధర ఎంతంటే..

Gold and Silver prices today : రూ. 1లక్షకు చేరువలో వెండి రేటు- బంగారం ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

15 September 2024, 5:30 IST

google News
    • Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 68,650గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,86,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,865గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 74,890గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,48,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,489గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,040గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,890గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,890గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,890గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,890గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,940గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,890గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,200గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 92,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 97,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,000.. బెంగళూరులో రూ. 90,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 280 పెరిగి రూ. 26,800కి చేరింది. శనివారం ఈ ధర రూ. 26,520గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం