తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కారులో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. త్వరలోనే ఫ్లైయింగ్ కార్లు లాంచ్ అయ్యే అవకాశం!

కారులో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. త్వరలోనే ఫ్లైయింగ్ కార్లు లాంచ్ అయ్యే అవకాశం!

Anand Sai HT Telugu

22 September 2024, 15:00 IST

google News
    • Flying cars : టెక్నాలజీ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే ఎగిరే కార్లు అనేది ఓ కలగా ఉంది. త్వరలో ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ కంపెనీ ఫ్లైయింగ్ కార్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అలెఫ్ మోడల్ ఎ
అలెఫ్ మోడల్ ఎ

అలెఫ్ మోడల్ ఎ

ఫ్లైయింగ్ కార్ల గురించి చాలా సార్లు విన్నాం. సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో ఫ్లైయింగ్ కార్ల చూసి ఉంటాం. కానీ రియాలిటీలోకి ఈ కార్లు వస్తే ఎంత బాగుంటుంది. ట్రాఫిక్ జామ్‌లు, సిగ్నల్స్ దగ్గర ఆగడాలు లేకుండా కారులో వెళ్తే సూపర్‌గా అనిపిస్తుంది కదా. ఆ ఫాంటసీ నెమ్మదిగా వాస్తవానికి దగ్గరగా వస్తోంది.

కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ఎగిరే కార్లను తీసుకురావాలనే ప్రాజెక్టుతో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2025లో ఉత్పత్తి ప్రారంభం కానుండటంతో ప్రజలు కలలు కనే ఫ్లైయింగ్ కార్లు రోడ్ల మీద వెళ్లనున్నాయి. ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చాలని అలెఫ్‌కు చెందిన మోడల్ ఎ లక్ష్యంగా పెట్టుకుంది. మొదట్లో కంపెనీ తయారీ ఒప్పందాలపై సందేహాలు చాలానే వచ్చాయి. కానీ ఇటీవలి ఒప్పందాలు ఫ్లైయింగ్ కార్లు త్వరలో లాంచ్ అవుతాయనేలా ఉన్నాయి.

అలేఫ్ ఏరోనాటిక్స్ మోడల్ ఎ ఫ్లయింగ్ కారును ఒక సంవత్సరం క్రితం ప్రకటించినప్పుడు చాలా మంది లైట్ తీసుకున్నారు. కారు ఖరీదు 300,000 డాలర్లు కావడం, ఎగిరే కారు అనడంతో అంతలేదు అని చాలా మంది కొట్టిపారేశారు. కార్స్కూప్స్ నివేదిక ప్రకారం.. తయారీ ఒప్పందాలను సాధించడంతో అలెఫ్ విజయం సాధించింది. 2025 నాటికి మోడల్ ఎ ను ప్రారంభించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

అలెఫ్ ఏరోనాటిక్స్ మోడల్ ఎ కోసం 3,200 ప్రీ-ఆర్డర్లను పొందినట్లు పేర్కొంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) నుండి ప్రత్యేక ఎయిర్వర్త్నెస్ సర్టిఫికేషన్‌ పొందినట్లు కంపెనీ పేర్కొంది. ఇది కీలకమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధృవీకరించింది.

అలెఫ్ ఏరోనాటిక్స్ సర్టిఫైడ్ ఏవియేషన్ కాంపోనెంట్స్ తయారీకి పుకారా ఏరో, ఎంవైసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సరఫరాదారులు ఎయిర్ బస్, బోయెంగ్ వంటి విమానయాన పరిశ్రమలోని కొన్ని పెద్ద పేర్లకు విడిభాగాలను కూడా అందిస్తారు.

'ప్రీ-ఆర్డర్ల సంఖ్య పెరగడం, దాని తుది రూపకల్పనకు చేరుకోవడంతో మా మోడల్ ఎ కారు సిద్ధమవుతుంది. భద్రత మా మొదటి ప్రాధాన్యత.' అని అలెఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ దుఖోవ్నీ చెప్పారు.

అలెఫ్ మోడల్ ఎ చాలా భిన్నంగా కనిపిస్తుంది. మోడల్ ఎ పెద్ద రెక్కలను కలిగి ఉండటానికి బదులుగా.. దాని పోరస్ ఫ్రేమ్‌లో ప్రొపెల్లర్లపై ఆధారపడుతుంది. ఇది వాహనాన్ని టేకాఫ్, ల్యాండింగ్ కోసం అనుమతిస్తుంది. రోడ్డు, ఫ్లైయింగ్ మోడ్‌లకు అత్యంత భద్రత ఉండేలా ప్యాసింజర్ పాడ్‌ను రూపొందించారు.

అలెఫ్ మోడల్ ఎ ఉత్పత్తి 2025 నాల్గో త్రైమాసికంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సంస్థ రెండో ఎగిరే కారు ప్రాజెక్టుపై కూడా పనిచేస్తోందని పేర్కొంది. మోడల్ ఎ మాదిరిగా కాకుండా, మోడల్ జెడ్ అని పిలువబడే రెండో ఎగిరే కారు చాలా చౌకగా ఉంటుందని అంటున్నారు. దీని ధర సుమారు 35,000 డాలర్లుగా ఉండవచ్చు.

తదుపరి వ్యాసం