17 ఏళ్లలో 33 లక్షల మందికి పైగా కొనుగోలు చేసిన కారు.. దీని మైలేజ్ 27 కి.మీ.-more than 33 lakh units of hyundai i10 sold in 17 years know this car features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  17 ఏళ్లలో 33 లక్షల మందికి పైగా కొనుగోలు చేసిన కారు.. దీని మైలేజ్ 27 కి.మీ.

17 ఏళ్లలో 33 లక్షల మందికి పైగా కొనుగోలు చేసిన కారు.. దీని మైలేజ్ 27 కి.మీ.

Anand Sai HT Telugu
Sep 22, 2024 02:01 PM IST

Hyundai i10 Sales : దేశంలోని కొన్ని కార్లు అధికంగా అమ్ముడైనవాటి జాబితాలో ఉన్నాయి. కానీ కొన్ని కార్లు 10 లక్షల యూనిట్లు అమ్మేందుకు కూడా సంవత్సరాలు పడుతుంది. అయితే హ్యుందాయ్ ఐ10 కారు లాంచ్ అయినప్పటి నుంచి చాలా అమ్మకాలు చేసింది.

హ్యుందాయ్ ఐ10 అమ్మకాలు
హ్యుందాయ్ ఐ10 అమ్మకాలు

దేశంలోని కొన్ని కార్లు ఏ కంపెనీ టచ్ చేయలేని మార్క్ క్రియేట్ చేశాయి. అధికంగా కార్లు అమ్ముడుపోవడానికి కొన్నింటికి చాలా సంవత్సరాలు పడుతుంది. మరికొన్ని కార్లు త్వరగానే ఎక్కువ అమ్మకాలు ఉంటాయి. హ్యుందాయ్ ఐ20 కూడా మంచి అమ్మకాలతో ముందు వరుసలో ఉంటుంది. లాంచ్ అయినప్పటి నుండి 3.3 మిలియన్ యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటిన కంపెనీ నుండి వచ్చిన ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇది. ఇది 2007లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఐ10 ఫ్యామిలీలో గ్రాండ్ ఐ10, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లు ఉన్నాయి. శాంత్రో, ఐ20, క్రెటా వంటి మోడళ్లు ఈ మైలురాయిని అందుకోలేకపోవడం విశేషం.

హ్యుందాయ్ ఐ10 ఇంజన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఐ10 నియోస్ 1.2-లీటర్ కప్పా పెట్రోల్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 83బిహెచ్‌పీ పవర్, 113.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటో ఎఎమ్టి ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్ కిలోకు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో మోనోటోన్ టైటాన్ గ్రే, పోలార్ వైట్, ఫెర్రీ రెడ్, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్, టీల్ బ్లూ రంగులు ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్, స్పార్క్ గ్రీన్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి.

సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగులు, ఫుట్ వెల్ లైటింగ్, టైప్ సీ ఫ్రంట్ యూఎస్‌బీ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఐ10 నియోస్‌లో ఉన్నాయి. నిగనిగలాడే బ్లాక్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, కనెక్టెడ్ డిజైన్‌తో కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. డ్యాష్ బోర్డ్‌పై ఫ్రెష్ గ్రే అప్ హోల్ స్టరీ, వేవ్ ప్యాటర్న్స్ వంటి ఫీచర్లతో ఇంటీరియర్స్‌ను అలంకరించారు.

ఐ10 నియోస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో క్రూయిజ్ కంట్రోల్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌‍‌ను కలిగి ఉంది. ఎకో కోటింగ్ టెక్నాలజీ, రియర్ ఏసీ వెంట్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రియర్ పవర్ అవుట్ లెట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్‌తో సేఫ్టీ ఫీచర్లను మెరుగుపరిచారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షల వరకు ఉంది.

Whats_app_banner