Govt Jobs 2024 : హైదరాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే
Hyderabad Hindustan Aeronautics Limited Jobs 2024 : హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదైలంది. ఇందులో భాగంగా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి
Hyderabad Hindustan Aeronautics Limited Jobs 2024 : హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా… 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూన్ 17వ తేదీని తుది తేదీగా ప్రకటించారు. https://hal-india.co.in/career వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ - హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, హైదరాబాద్.
- మొత్తం ఖాళీలు - 20
- ఖాళీల వివరాలు - సీఎంఎం ఇంజినీర్ 4, మిడిల్ స్పెషలిస్ట్- 08, జూనియర్ స్పెషలిస్ట్ - 08
- అర్హతలు - టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడొచ్చు.
- దరఖాస్తులు - ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు - రూ.500 గా నిర్ణయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
- దరఖాస్తులకు చివరి తేదీ - 17 జూన్ 2024.
- రాత పరీక్ష తేదీ: 23 జూన్ 2024.
- ఎంపిక విధానం - షార్ట్‌లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://hal-india.co.in/career
పోస్టుల భర్తీకి హైదరాబాద్ NIN ప్రకటన…..
ICMR NIN Vacancy 2024 Notification: హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ICMR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్- గ్రేడ్ 1తో పాటు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.మే 23వ తేదీ నుంచే అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా… జూన్ 16వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. రాత పరీక్ష జూలైలో ఉంటుంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్
- మొత్తం ఖాళీలు - 44
- ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్- 8, టెక్నీషియన్- గ్రేడ్ 1- 14 ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 1 - 22 ఉద్యోగాలు.
- అర్హత- పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో ఆ వివరాలను చూడొచ్చు.
- ఎంపిక విధానం - రాత పరీక్ష ఆధారంగా
- దరఖాస్తులు - ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ రుసుం - ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం -మే 23, 2024.
- దరఖాస్తు చివరి తేదీ- 16-జూన్-2024.
- రాత పరీక్ష- జులై 2024లో ఉంటుంది. తేదీలను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.nin.res.in/
టాపిక్