Ferrari Purosangue : ఇండియాలోకి ఫెరారీ తొలి ఎస్యూవీ.. ధర తెలిస్తే షాక్!
01 March 2024, 6:30 IST
- Ferrari Purosangue SUV : ఫెరారీ సంస్థ.. ఇండియాలో ఎట్టకేలకు ఓ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ లగ్జరీ ఎస్యూవీ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే! కానీ.. ధర భారీగా ఉన్నాప్పటికీ, కస్టమర్లలో ఈ ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది!
ఇండియాలోకి ఫెరారీ తొలి ఎస్యూవీ.. ధర తెలిస్తే షాక్!
Ferrari Purosangue price in India : లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఫెరారీ నుంచి తొలి ఎస్యూవీ.. తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని పేరు ఫెరారీ పురోసాంగ్యూ. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
పురోసాంగ్యూ ఇండియా లాంచ్..
పురోసాంగ్యూలో మస్క్యులర్ బానెట్, బంపర్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్ల్పిట్ టైప్ డీఆర్ఎల్స్, భారీ గ్రిల్, సూసైడ్ స్టైల్ రేర్ డోర్స్, డిజైనర్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి వస్తున్నాయి.
Ferrari Purosangue price : ఇదొక 4 సీటర్ ఎస్యూవీ. ఈ ఫెరారీ లగ్జరీ ఎస్యూవీ కేబిన్‌లో ప్రీమియం లెథర్ అప్‌హోలిస్ట్రీ, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, పాడిల్ షిఫ్టర్స్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటివి లభిస్తున్నాయి.
ఈ ఫెరారీ పురోసాంగ్యూ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది ఫెరారీ సంస్థ. సైడ్స్‌లో ఫెరారీ షీల్డ్స్, అప్‌గ్రేడెడ్ వీల్స్, పైంటెడ్ బ్రేక్ కాలిపర్స్, కాన్ట్రాస్టింగ్ ఇంటీరియర్ స్టిచింగ్, రెండు యాగ్సిల్స్కి సస్పెన్షన్ లిఫ్ట్ ఫంక్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు.
ఇదీ చూడండి:- New Cars launch in March: ఈ మార్చి నెలలో లాంచ్ కానున్న కొత్త కార్లు ఇవే..
Ferrari Purosangue interior : ఈ ఫెరారీ పురోసాంగ్యూలో 6.5 లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్, వీ12 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్.. 715 హెచ్‌పీ పవర్‌ని, 716 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 8 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ దీనికి లభిస్తుంది. ఇదొక.. 4 వీల్ డ్రైవ్ సిస్టెమ్.
ఫెరారీ పురోసాంగ్యూ ధర ఎంతంటే..
ఇండియాలోకి వచ్చిన ఫెరారీ తొలి ఎస్యూవీ పురోసాంగ్యూ ఎక్స్‌షోరూం ధర రూ. 10.5 కోట్లు! బెంగళూరులో మొదటి ఎస్‌యూవీని ఇటీవలే డెలివరీ చేసింది సంస్థ.
Ferrari Purosangue India : అయితే.. ఈ ఫెరారీ పురోసాంగ్యూకి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది! ఎంతలా అంటే.. 2026 వరకు అప్పుడే ఆర్డర్ బుక్స్‌ని సంస్థ మూసేసింది! ఓపెన్ అయిన తర్వాత.. ఈ లగ్జరీ ఎస్యూవీ ధర కనీసం 20శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఎస్‌యూవీకి సూపర్ క్రేజ్ లభిస్తోంది! ఆర్డర్ బుక్‌ని మూసేసినా పర్లేదు, ఓపెన్ అయ్యేంత వరకు ఎదురుచూసి, ఈ ఎస్‌యూవీని కచ్చితంగా కొంటామని కస్టమర్లు అంటున్నారట!
ఇండియాలో ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ఇక ఈ ఫెరారీ కొత్త వెహికిల్తో.. లగ్జరీ ఎస్‌యూవీలకు కూడా క్రేజ్ ఉందని స్పష్టమైంది. ఇది లగ్జరీ వాహనాల తయారీ సంస్థలకు గుడ్ న్యూస్ అవుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని వెహికిల్స్ లాంచ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.