BYD floating car : పడవలా.. నీటిపై తేలే ఎస్​యూవీ ఇది! ఇదిగో వీడియో..-byds floating car takes centre stage at geneva motor show see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Floating Car : పడవలా.. నీటిపై తేలే ఎస్​యూవీ ఇది! ఇదిగో వీడియో..

BYD floating car : పడవలా.. నీటిపై తేలే ఎస్​యూవీ ఇది! ఇదిగో వీడియో..

Sharath Chitturi HT Telugu
Feb 27, 2024 11:52 AM IST

BYD floating car : నీటిపై తేలే కారును ప్రదర్శించింది చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీ. వీడియోను ఇక్కడ చూసేయండి..

పడవలా.. నీటిపై తేలే ఎస్​యూవీ ఇది!
పడవలా.. నీటిపై తేలే ఎస్​యూవీ ఇది!

Yangwang U8 SUV : ప్రపంచ ఆటోమొబైల్​ మార్కెట్​ని షాక్​కు గురిచేస్తూ.. సరికొత్త టెక్నాలజీతో ఓ లగ్జరీ ఎస్​యూవీని ప్రదర్శించింది చైనాకు చెందిన బీవైడీ. ఈ ఎస్​యూవీ పేరు యాంగ్​వాంగ్​ యూ8. ఇదొక ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​​. పడవలా.. నీటిపై తేలుతుంది ఈ కారు. అవును మీరు విన్నది నిజమే!

పడలా.. నీటిపై ప్రయాణించే కారు!

చైనాలో ఇప్పటికే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీవైడీ సంస్థ.. యూరోపియన్​ మార్కెట్​పై ఫోకస్​ చేసింది. ఇందులో భాగంగా.. జెనెవా కార్​ షోలో భాగంగా.. ఈ 1,200 హెచ్​పీ యాంగ్​వాంగ్​ యూ8 ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ని ప్రదర్శించింది. ఇదొక ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.

ఈ ఎస్​యూవీ ఆఫ్​రోడ్​లో మాత్రమే కాదు, ఆఫ్​-ల్యాండ్​పైనా ప్రయాణించగలదు! అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా.. ఈ వెహికిల్​ని రూపొందించింది సంస్థ. మీరు వరదల్లో చిక్కుకుని ఉంటే.. ఈ ఎస్​యూవీ సస్పెన్షన్స్​ ఎలివేట్​ అవుతాయి. ఇంజిన్​ ఆగిపోతుంది. హెచ్​వీఏసీ సిస్టెమ్​ ఆన్​ అవుతుంది. రీ-సర్క్యులేషన్​ మోడ్​ మొదలవుతుంది. విండోలు పూర్తిగా మూసుకుపోతాయి. ఇలా.. 30 నిమిషాల పాటు నీటిలో ప్రయాణించవచ్చు!

Yangwang u8 electric SUV : అంతేకాకుండా.. ఈ యాంగ్​వాంగ్​ యూ8 కొత్త ఎడిషన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. 360 డిగ్రీ ట్యాంక్​ టర్న్​ కూడా చేయగలదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

సరికొత్త యాంగ్​వాంగ్​ యూ8 ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​.. ఒక ఎక్స్​టెండెడ్​ రేంజ్​వీ. అంటే.. ఇందులో 4మోటార్​ ఎలక్ట్రిక్​ ఇంజిన్​, 2.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ 4 సిలిండర్​ ఇంజిన్​లు ఉంటాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 620కి.మీలకుపైగా దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది.

ఈ యాంగ్​వాంగ్​ యూ8 ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ ఎస్​యూవీ ధరపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దీని ప్రారంభ ధర 1,50,000 డాలర్లుగా ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. అంటే.. ఇండియన్​ కరెన్సీలో అది రూ. 1.24 కోట్లు!

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన యాంగ్​వాంగ్​ యూ8 ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​కి​ సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి :

Yangwang u8 electric suv price : ఈ బీవైడీ యాంగ్​వాంగ్​ యూ8 లేటెస్ట్​ ప్రీమియం ఎస్​యూవీ​ సంచలనం సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. మెర్సిడెస్​ బెంజ్​ జీ వాగ్నర్​, రేంజ్​ రోవర్​కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి బీవైడీ స్ట్రాటజీ కూడా ఇదే! యూరోపియన్​ మార్కెట్​లో సత్తా చాటాలని ఆ సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఇందుకు నిదర్శనం.

అయితే.. నీటిపై తేలియాడే వెహికిల్​ని రూపొందించిన తొలి కంపెనీ బీవైడీ కాదు! టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​కి కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. వాటిని.. తన సైబర్​ట్రక్​పై అమలు చేశారు. 'కొంతసేపు ఈ ట్రక్​ బోటుగా పనిచేస్తుంది!' అని గతేడాది ఆయన ట్వీట్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం