BYD Seal : ఇండియాలో బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..-byd seal electric vehicle to launch as chinese carmakers third ev in india on march 5 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Seal : ఇండియాలో బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

BYD Seal : ఇండియాలో బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Sharath Chitturi HT Telugu
Feb 16, 2024 11:32 AM IST

BYD Seal launch in India : చైనాకు చెందిన దిగ్గజ ఈవీ తయారీ సంస్థ బీవైడీ.. ఇండియాలో కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ని లాంచ్​ చేయనుంది. బీవైడీ సీల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..
ఇండియాలో బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

BYD Seal price in India : ఇండియా ఈవీ సెగ్మెంట్​కు కనిపిస్తున్న భారీ డిమాండ్​కు క్యాష్​ చేసుకునేందుకు దేశీయ ఆటోమొబైల్​ సంస్థలతో పాటు విదేశీ కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి. ఇందులో మొదటి వరుసలో ఉంది.. చైనాకు చెందిన దిగ్గజ ఈవీ తయారీ సంస్థ బీవైడీ. ఈ సంస్థకు ఇండియాలో ఇప్పటికే 2 ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. మూడో ఈవీని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​.. మార్చ్​ 5న ఇండియాలో లాంచ్​ అవుతుంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​..

బీవైడీకి ఇండియాలో.. అట్టో 3 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో పాటు ఈ6 ఎలక్ట్రిక్​ ఎంపీవీ మోడల్స్​ ఉన్నాయి. ఇప్పుడు.. ఈ సీల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​.. మార్చ్​ 5న బీవైడీ పోర్ట్​ఫోలియోలో చేరనుంది.

ఈ బీవైడీ సీల్​ ఈవీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉంది. టెస్లా మోడల్​ 3కి ఇది గట్టి పోటీనిస్తోంది. ఈ సెడాన్​ పొడవు 4800ఎంఎం. వెడల్పు 1875ఎంఎం. ఎత్తు 1460 ఎంఎం. ఈ- ప్లాట్​ఫామ్​ 3.0 అనే ప్లాట్​ఫామ్​పై ఈ ఈవీని రూపొందించింది బీవైడీ.

BYD Seal India Launch : డిజైన్​ పరంగా చూస్తే.. ఈ బీవైడీ సీల్​కి ఎయిరోడైనమిక్​ బాడీ లభిస్తుంది. క్రిస్టల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, బూమరాంగ్​ షేప్​లోని ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫుల్​ విడ్త్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ వంటివి కూడా ఉన్నాయి.

BYD Seal Interior : ఇంటీరియర్​ విషయానికొస్తే.. బీవైడీ సీల్ ఈవీ​లో ప్రీమియం లుక్​ స్పష్టంగా కనిపిస్తుంది. డాష్​బోర్డ్​లో పెద్ద 15.6 ఇంచ్​ రొటేటింగ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది. అట్టో 3 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇక కొత్త ఈవీలో 10.25 ఇంచ్​ డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే కూడా ఉంటుంది. హెడ్​-అప్​ డిస్​ప్లే, 2 వయర్​లెస్​ ఛార్జింగ్​ పాడ్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

బీవైడీ సీల్​ ఈవీ- రేంజ్​..

బీవైడీకి చెందిన బ్లేడ్​ బ్యాటరీ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. అంతర్జాతీయ మర్కెట్​లో అయితే.. ఈ బీవైడీలో రెండు బ్యాటరీ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 61.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ, 82.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్​. మొదటి బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 550 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. రెండో బ్యాటరీ రేంజ్​ 700 కి.మీ అని సంస్థ చెబుతోంది. అంతేకాకుండా.. బీవేడీకి చెందిన ఫాస్ట్​ ఛార్జింగ్​ (150 కేడబ్ల్యూ) ఫెసిలిటీ కూడా ఈ వెహికిల్​కి లభిస్తోంది.

BYD Seal EV : ఇండియన్​ రోడ్లపై కనిపించే సేఫెస్ట్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో బీవైడీ సీల్​ కూడా ఉండనుంది! యూరో క్రాష్​ టెస్ట్​లో ఈ ఈవీకి 5 స్టార్​ రేటింగ్​ వచ్చింది. ఎన్నో సేఫ్టీ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

బీవైడీ సీల్​ ఈవీ- ధర ఎంత ఉండొచ్చు?

బీవైడీ సీల్​ ఈవీలో సింగిల్​ పీఎంఎస్​, డ్యూయెల్​ మోటార్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇండియాలో.. డ్యూయెల్​ మోటర్​ వర్షెన్​ లాంచ్​ అవ్వొచ్చు. ఇది 523 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 3.8 సెకన్లలో ఇది అందుకుంటుంది.

BYD Seal price : ఈ బీవైడీ సీల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​ ఫీచర్స్​ని చూస్తేనే.. ఇదొక ప్రీమియం, లగ్జరీ వెహికిల్​అని చెప్పేయొచ్చు. అయితే.. దీని ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 65లక్షలు- రూ. 70 లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక లాంచ్​ తర్వాత.. ఈ బీవైడీ సీల్​ ఈవీ.. ఇండియాలో ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్​ కార్లు ఈవీ6, బీఎండబ్ల్యూ ఐ4కి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనం