తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk's Burnt Hair Perfume వాసన అలా ఉంటుంది, దీని ధర ఎంతంటే?

Elon Musk's Burnt Hair Perfume వాసన అలా ఉంటుంది, దీని ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

13 October 2022, 11:19 IST

google News
    • Elon Musk's Burnt Hair Perfume: ప్రపంచ కుబేరుడు తన బ్రాండ్ మీద ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశారు. మరి దాని ధర ఎంత, సువాసన ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి.
Elon Musk's Burnt Hair Perfume
Elon Musk's Burnt Hair Perfume (twitter)

Elon Musk's Burnt Hair Perfume

సువాసన అనే పేరుగల వారు ఎవరైనా ఉంటారా? 90ML అనే తెలుగు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు సువాసననే. అలాగే పరిమళ, సుగంధ, జాస్మిన్ లాంటి పేర్లు కూడా మంచి వాసన అనే అర్థాన్ని ఇస్తాయి. ఇలాంటి పేరు కలిగిన వారు తమ బ్రాండ్ మీద ఒక సెంట్ లభించాలని కోరుకుంటే ఎలా ఉంటుంది? ప్రపంచ కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మాస్క్ ఇలాగే ఆలోచించారు.

ఎలాన్ మస్క్ ఇప్పుడు కొత్త వ్యాపార వెంచర్‌ను ప్రారంభించారు. బర్న్ట్ హెయిర్ (Burnt Hair) పేరిట ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశారు. తన ట్విట్టర్ బయోని 'పెర్ఫ్యూమ్ సేల్స్‌మ్యాన్' అని అప్‌డేట్ చేసుకున్నారు. Burnt Hair - 'భూమిపై అత్యుత్తమ సువాసన' అంటూ తన ప్రొడక్టును మార్కెటింగ్ కూడా చేయడం ప్రారంభించారు.

ఎలాన్ మస్క్ లాంచ్ చేసిన బర్న్ట్ హెయిర్ సెంట్ బాటిల్ ధర 100 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో ప్రస్తుతం సుమారు రూ. 8,400/- . లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే 20 వేల Burnt Hair సెంట్ బాటిళ్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది.

Elon Musk's Burnt Hair Perfume- మస్క్ పర్ఫ్యూమ్ వెనక కథ

ఎలాన్ మస్క్ పేరులో మస్క్ అంటే ఒక రకమైన సువాసన అనే అర్థం వస్తుంది. ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ ప్రస్తావిస్తూ ఇలా రాశారు " నా లాంటి పేరుతో, సువాసన వ్యాపారంలోకి రావడం అనివార్యం.. కానీ నేనెందుకు ఇంత కాలం పోరాడాను" అంటూ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ టెస్లా కార్ల కంపెనీ అమెరికాలో చాలా పాపులర్. ఇవి చాలా ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష నౌకల తయారీ కంపెనీ ఉంది. అలాంటి వ్యాపారవేత్తకు సెంట్ బాటిల్ వ్యాపారంలోకి రావాలంటే ఎంతసేపు? కానీ చాలా కాలం పోరాడాల్సి వచ్చిందన్నట్లుగా తనకు తానుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మస్క్ ట్వీట్ చేశారు.

Burnt Hair - Scent For Men, Smell Like..

ఇక, ఎలాన్ మస్క్ తన బ్రాండ్ అయిన 'ది బోరింగ్ కంపెనీ' ద్వారా బర్న్ట్ హెయిర్ పెర్ఫ్యూమ్‌ను మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ సెంట్ మగవారి కోసం. దీని వాసన కొంచెం బొగ్గు, బార్బెక్యూ మిక్స్, క్యాండిలైట్ డిన్నర్ కలగలిసినట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఎంతమందిలో ఉన్నా ఈ సువాసన వ్యక్తులను ప్రత్యేకంగా నిలుపుతుందట.

The Boring Company అధికారిక వైబ్‌‌సైట్లో Burnt Hair పెర్ఫ్యూమ్‌ కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం