Citroen e-C3 electric launch : సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ వర్షెన్ లాంచ్ ఎప్పుడంటే..
25 November 2022, 8:53 IST
- Citroen e-C3 electric launch date in India : 2023 జనవరిలో.. సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ వర్షెన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలు..
సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ వర్షెన్ లాంచ్ ఎప్పుడంటే..
Citroen e-C3 electric launch date in India : సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ వర్షెన్‌పై గత కొంతగాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రేపో.. మాపో లాంచ్ అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేసింది సిట్రోయెన్ సంస్థ. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో.. సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ వర్షెన్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు సంస్థ గ్లోబల్ సీఈఓ కార్లోస్ టవారెస్ ప్రకటించారు. ప్రత్యేకంగా డేట్‌ని ఇంకా ప్రకటించలేదను కానీ.. 2023 ఆటో ఎక్స్పో తర్వాత.. అంటే జనవరిలో సిట్రోయెన్ సీ3 ఈవీ లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.
సిట్రోయెన్ ఈ సీ3..
ఈ వెహికిల్‌కి సిట్రోయెన్ ఈ సీ3 అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీ3 మోడల్‌ను ఆరు నెలల క్రితమే ఇండియాలో లాంచ్ చేసింది సిట్రోయెన్. ఇప్పుడు సీ3కి ఎలక్ట్రిక్ వర్షెన్‌పై ప్లాన్స్ వేస్తుండటం విశేషం. ఈ సిట్రోయెన్ ఈ సీ3 ధర రూ. 10లక్షలు- 12లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
Citroen E C3 launch in India : "సరసమైన ధరల్లో ఈవీని అందించడమే ఇప్పుడు ముఖ్యమైన విషయం. సరసైన ధరలతో వస్తేనే డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో మాకు మార్కెట్ షేరును హడావుడిగా పెంచేసుకోవాలని ఏం లేదు. సమయంతో పాటు మేము మెరుగుపడతాము," అని కార్లోస్ టవారెస్ అభిప్రాయపడ్డారు.
ఈ సిట్రోయెన్ ఈ సీ3లో 30.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. కారులో 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్, సీసీఎస్2 ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఉండే అవకాశం ఉంది.
Citroen E C3 : "ఇండియా మార్కెట్ నుంచే బ్యాటరీని కొనుగోలు చేయాలని నాకు అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఎవరు లభించలేదు. మరికొన్నేళ్లల్లో ఇది జరగకవచ్చు," అని కార్లెస్ టవారెస్ పేర్కొన్నారు.
సిట్రోయెన్ ఈ సీ3 సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 63కేడబ్ల్యూ పవర్, 143ఎన్ఎం టార్క్ జనరేట్ అవ్వొచ్చు. టాటా టియాగో ఈవీ.. 74హెచ్‌పీ పవర్‌ను, 114ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
సిట్రోయెన్ సీ3తో పోల్చుకుంటే.. సిట్రోయెన్ ఈ సీ3 ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
భారీ డిస్కౌంట్లు..
Discounts on Citroen C3 : మరోవైపు.. సిట్రోయెన్ సీ3 పెట్రోల్ వర్షెన్‌పై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 10వేల వరకు లభిస్తోంది. కార్పొరేట్ బోనస్ కింద మరో రూ. 10వేలను ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు.. వాహనం కొనుగోలు చేసిన వారికి రెండేళ్ల మెయింటేనెన్స్ ప్యాకేజీని ఉచితంగా ఇస్తోంది సిట్రోయెన్. దీని విలువ రూ. 10వేల వరకు ఉండొచ్చు. ఈ వాహనంపై సంస్థ.. ఎలాంటి క్యాష్ డిస్కౌంట్‌ను ఇవ్వడం లేదు. అంటే.. సిట్రోయెన్ సీ3పై రూ. 30వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నట్టు అర్థం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.