తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Ec3 Vs Tata Tiago Ev : సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టియాగో ఈవీ.. ది బెస్ట్​ ఏది?

Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టియాగో ఈవీ.. ది బెస్ట్​ ఏది?

31 January 2023, 10:20 IST

google News
    • Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్​ ఈసీ3.. లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టాటా టియాగో ఈవీతో ఈ ఈవీని పోల్చి.. ది బెస్ట్​ ఏదనేది ఇప్పుడు తెలుసుకుందాము.
సిట్రోయెన్​ ఈసీ3
సిట్రోయెన్​ ఈసీ3

సిట్రోయెన్​ ఈసీ3

Citroen eC3 vs Tata Tiago EV : ఇండియా ఆటో మర్కెట్​లో ప్రస్తుతం ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది! వివిధ ఈవీల లాంచ్​లతో ఆటో సంస్థలు బిజీబిజీగా ఉంటున్నాయి. ఇండియా ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే.. టాటా మోటార్స్​కు గట్టిపోటీనిచ్చేందుకు ఇతర సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయి. ఈ లిస్ట్​లో సిట్రోయెన్​ ఆటో సంస్థ ముందు వరుసలో ఉంది! సిట్రోయెన్​ ఈసీ3 ఈవీని ఆవిష్కరించింది. ఫిబ్రవరిలో ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. లాంచ్​ తర్వాత.. ఈ సిట్రోయెన్​ ఈసీ3.. టాటా టియాగో ఈవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. మరి వీటిని ఓసారి పోల్చి చూసి ది బెస్ట్​ ఈవీ ఏదనేది తెలుసుకుందాము..

సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టాటా టియాగో ఈవీ- డైమెన్షన్స్​..

Citroen eC3 launch date in India : సిట్రోయెన్​ ఈసీ3 పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం, ఎత్తు 1,586ఎంఎం. రూఫ్​ రెయిల్స్​తో కలుపుకుని 1,604 ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,540ఎంఎం.

ఇక టాటా టియాగో ఈవీ పొడవు 3,769ఎంఎం. వెడల్పు 1,677ఎంఎం. ఎత్తు 1,536ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,400 ఎంఎం. డైమెన్షన్స్​ విషయంలో సీట్రోయెన్​ ఈసీ3.. టటా టియాగో ఈవీని డామినేట్​ చేస్తోందని స్పష్టమవుతోంది.

సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టాటా టియాగో ఈవీ- ఇంజిన్​..

Citroen eC3 range : సిట్రోయెన్​ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్​తో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. ఇది 57పీఎస్​ పవర్​ను, 143ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఈవీ 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. 10-100శాతం ఛార్జింగ్​కు 15ఏ ప్లగ్​ పాయింట్​తో 30 నిమిషాలు పడుతుందని సమాచారం. ఇక డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​తో 10-80శాతం ఛార్జింగ్​కు 57 నిమిషాలు పడుతుందని తెలుస్తోంది.

టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 19.2కేడబ్ల్యూహెచ్​, 24కడబ్ల్యూహెచ్​. మొదటిది.. 61పీఎస్​ పవర్​ను, 110ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 250కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 10-100శాతం ఛార్జింగ్​ కోసం 3.3కేడబ్ల్యూ ఛార్జర్​తో 6.4గంటలు పడుతుంది. 25కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​తో.. 10-80శాతం ఛార్జింగ్​కు 57 నిమిషాలు పడుతుంది.

Tata Tiago EV range : ఇక రెండో బ్యాటరీ ప్యాక్​ 75పీఎస్​ పవర్​ను, 114 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 315కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 7.2కేడబ్ల్యూ ఛార్జర్​తో 10-100శాతం ఛార్జింగ్​కు 3.6గంటల సమయం పడుతుంది. 25కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​తో 10-80శాతం ఛార్జింగ్​కు 57 నిమిషాల సమయం పడుతుంది.

టాటా టియాగోతో ఈవీతో పోల్చుకుంటే.. సిట్రోయెన్​ ఈసీ3 ఈవీ రేంజ్​ పెద్దగా ఉంది.

సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టాటా టియాగో ఈవీ- ఫీచర్స్​..

సిట్రోయెన్​ ఈసీ3లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​తో కూడిన హాలోజెన్​ హెడ్​ల్యాంప్స్​ ఉన్నాయి. ఆప్షనల్​ డ్యూయెల్​ టోన్​ రూఫ్​ కూడా లభిస్తోంది. రూఫ్​ రైల్స్​, బాడీ కలర్డ్​ బంపర్స్​, ఫుల్​ వీల్​ కవర్స్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, క్రోమ్​ ఇన్​సైడ్​ డోర్​ హ్యండిల్స్​, ఫిక్స్​డ్​ ఫ్రంట్​ అండ్​ రేర్​ హెడ్​రెస్ట్​, డిజిటైజ్​డ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12వీ సాకెట్​, టిల్ట్​ స్టీరింగ్​, మేన్యువల్​ ఏసీ, ఓఆర్​వీఎంలు, కీలెస్​ ఎంట్రీ, స్టీరింగ్​ మౌంటెడ్​ ఆడియో అండ్​ కాలింగ్​ కంట్రోల్స్​, హైట్​ అడ్జస్టెబుల్​ డ్రైవర్​ సీట్ ఉన్నాయి.

Citroen eC3 features : ఇందులో 4 పవర్​ విండోస్​, 4 స్పీకర్​ మ్యుజిక్​ సిస్టెమ్​, 10.2 ఇంచ్​ టచ్​స్క్రీన్​, కనెక్టెడ్​ కార్​ టెక్​, వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే, డ్యూయెల్​ ఫ్రంట్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, రేర్​ పార్కింగ్​ సెన్సార్స్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

టాటా టియాగో ఈవీలో.. ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​తో కూడిన ఆటో- ప్రొజెక్టెర్​ హెడ్​ల్యాంప్స్​, ఆప్షనల్​ బ్లాక్​ రూఫ్​, స్టైల్డ్​ వీల్​ కవర్స్​, ఫ్రంట్​ ఫాగ్​ ల్యాంప్స్​, బడీ కలర్డ్​ డోర్​ హ్యాండిల్స్​- బంపర్స్​, ఓఆర్​వీఎమ్​లు, లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, లెథర్​ వ్రాపిడ్​ స్టీరింగ్​ వీల్​, ఫ్లాట్​ బాటమన్​ స్టీరింగ్​ వీల్​, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​, ఆటో-డిమ్మింగ్​ ఐఆర్​వీఎం, ఆటో ఏసీ, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్​ ఓఆర్​వీఎం, క్రూయిజ్​ కంట్రోల్​, పుష్​ బటన్​ స్టార్ట్​/ స్టాప్​, రెయిన్​ సెన్సింగ్​ వైపర్స్​, డిజిటైజ్​డ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, హైట్​ అడ్జస్టెబుల్​ డ్రైవర్​ సీట్​, 4 పవర్​ విండోస్​, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​, 4 ట్వీటర్స్​- 4 స్పీకర్స్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే, రివర్సింగ్​ కెమెరా, డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్స్​, టీపీఎంసీ, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, రేర్​ పార్కింగ్​ సెన్సార్స్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

సిట్రోయెన్​ ఈసీ3తో పోల్చుకుంటే.. టాటా టియాగో ఈవీలో బెటర్​ ఫీచర్స్​ ఉన్నట్టు కనిపిస్తోంది.

సిట్రోయెన్​ ఈసీ3 వర్సెస్​ టాటా టియాగో ఈవీ- ధర..

Citroen eC3 price in Hyderabad : సిట్రోయెన్​ ఈసీ3 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.99లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Tata Tiago EV on road price in Hyderabad : ఇక టాటా టియాగో ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంటుంది.

తదుపరి వ్యాసం