Citroen C3 Shine vs Hyundai Venue : సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- ఏది బెటర్?
15 April 2023, 7:08 IST
- Citroen C3 Shine vs Hyundai Venue base model : సిట్రోయెన్ సీ3 షైన్ లాంచ్ అయ్యింది. దీనిని హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్‌తో పోల్చి, ఏది బెటర్ అన్నది చూద్దాము..
సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- ఏది బెటర్?
Citroen C3 Shine vs Hyundai Venue base model : సీ3కి టాప్ ఎండ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది సిట్రోయెన్ సంస్థ. దాని పేరు సిట్రోయెన్ సీ3 షైన్. ఇతర వేరియంట్స్‌లో మిస్ అయిన ఫీచర్స్ ఇందులో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్‌ను.. హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్‌తో పోల్చి, ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- లుక్స్..
Citroen C3 Shine on road price in Hyderabad : సిట్రోయెన్ సీ3లో డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. బంపర్ మౌంటెడ్ హెడ్‌లైట్స్, స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్స్, పెద్ద సిట్రోయెన్‌తో కూడిన స్లీక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, వ్రాప్ అరౌండ్ టెయిల్గేట్స్, 15 ఇంచ్ డైమెంట్ కట్ అలాయ్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇక హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్లో బంపర్- మౌంటెడ్ హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, డార్క్ క్రోమ్ గ్రిల్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, ఫ్రెంట్- రేర్ స్కిడ్ ప్లేట్స్, డిజైనర్ కవర్స్‌తో కూడిన 15 ఇంచ్ స్టీల్ వీల్స్ లభిస్తున్నాయి.
సిట్రోయెన్ సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- డైమెన్షన్స్..
Hyundai Venue on road price Hyderabad : సిట్రోయెన్ సీ3 పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం. ఎత్తు ,1586ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,540ఎంఎం ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ పొడవు 3,995ఎంఎం. వెడల్పు 1,770ఎంఎం. ఎత్తు 1,617ఎంఎం. వీల్‌బేస్ 2,500ఎంఎం. దీని బట్టి సిట్రోయెన్ సీ3 కన్నా వెన్యూ కాస్త పెద్దదిగా ఉంటుంది.
సిట్రోయెన్ సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- ఫీచర్స్..
సిట్రోయెన్ సీ3 షైన్‌లో 2 టోన్ డాష్బోరడ్, కీలెస్ ఎంట్రీ, ఫ్రెంట్- రేర్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్, మేన్యువల్ ఏసీ కంట్రోల్స్, 10.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్, వయర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ వస్తున్నాయి.
Citroen C3 Shine features : హ్యుందాయ వెన్యూ బేస్ మోడల్లో ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, 2 స్టెప్ రెక్లైనింగ్ రేర్ సీట్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ లభిస్తోంది.
సిట్రోయెన్ సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- ఇంజిన్..
సిట్రోయెన్ సీ3 టాప్ ఎండ్ వేరియంట్ షైన్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82హెచ్‌పీ పవర్‌ను, 115ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Hyundai Venue features : ఇక హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్లో 1.2 లీటర్, ఇన్లైన్ 4 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 83 హెచ్‌పీ పవర్‌ను, 114ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండిట్లోనూ 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తోంది.
సిట్రోయెన్ సీ3 షైన్ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ బేస్ మోడల్- ధర..
Citroen C3 Shine review : సిట్రోయెన్ సీ3 షైన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.6లక్షలు- రూ. 7.87లక్షల మధ్యలో ఉంది. ఇక హ్యుందాయ్ వెన్యూ బేస్ వేరియంట్.. హ్యుందాయ్ ఈ ఎక్స్‌షోరూం ధర రూ. 7.72లక్షలుగా ఉంది.