Hyundai Exter : టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. త్వరలోనే లాంచ్​!-hyundai exter confirmed as name of upcoming suv for india check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter : టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. త్వరలోనే లాంచ్​!

Hyundai Exter : టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Apr 15, 2023 06:38 AM IST

Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీని త్వరలోనే లాంచ్​ చేస్తున్నట్టు ప్రకటించింది హ్యుందాయ్​ సంస్థ. ఆ వివరాలు..

టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​..
టాటా పంచ్​కు పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. (Hyundai)

Hyundai Exter India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఓ కొత్త ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు హ్యుందాయ్​ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా.. వీటిని హ్యుందాయ్​ మోటార్స్​ ఇండియా కన్ఫర్మ్​ చేసింది. హ్యుందాయ్​ ఎక్స్​టర్ ఎస్​యూవీని లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది.

ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీగా..!

ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. సంస్థకు ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీగా ఉంటుందని తెలుస్తోంది. వెన్యూ, క్రేటా, అల్కజార్​, కోనా ఎలక్ట్రిక్​, టుక్సన్​, ఐయానిక్​ 5 వంటి ఎస్​యూవీల సరసన ఈ కొత్త మోడల్​ నిలవనుంది. ఇక ఈ సెగ్మెంట్​లో దూసుకెళుతున్న టాటా పంచ్​​కు ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ గట్టిపోటీని ఇస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Hyundai Exter launch in India : "మా కొత్త ఎస్​యూవీ పేరును ప్రకటించడం చాలా గర్వంగా ఉంది. అదే హ్యుందాయ్​ ఎక్స్​టర్​. జెన్​ జెడ్​ బయ్యర్స్​కు స్మార్ట్​ మొబిలిటీ సొల్యూషన్​ను అందించే విధంగా ఇది ఉంటుంది. మా ఎస్​యూవీ లైనప్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ 8వ మోడల్​. మా ఎస్​యూవీ సేల్స్​ వృద్ధికి ఇది సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము," అని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సీఓఓ తరుణ గర్గ్​ వెల్లడించారు.

హ్యుందాయ్​ శాంట్రో స్థానంలో..

Hyundai Exter price : ఇండియా చిన్న కార్ల సగ్మెంట్​లో హ్యుందాయ్ శాంట్రోకు మంచి డిమాండ్​ ఉండేది. కానీ ఈ మోడల్​ ఇప్పుడు కనుమరుగైపోయింది. మరికొన్ని వారాల్లో లాంచ్​ కానున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. ఈ స్థానాన్ని భర్తీ చేస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5లక్షల మార్క్​కు అటు, ఇటుగా ఉంటుందని తెలుస్తోంది.

చిన్న కార్లలో డీజిల్​ ఇంజిన్​లకు డిమాండ్​ లేకపోవడంతో.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో కేవలం పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​లోని 1.2 లీటర్​ నేచురల్సీ ఆస్పిరేటెడ్​​ పెట్రోల్​ ఇంజిన్​ని ఇక్కడ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే.. ఎక్స్​టర్​లో 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

Hyundai Exter launch date : ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధరకు సంబంధించిన వివరాలపై రానున్న రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇండియా మార్కెట్​లో సేల్స్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది హ్యుందాయ్​. ఈ క్రమంలోనే పలు ఆకర్షణీయమైన మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

Whats_app_banner

సంబంధిత కథనం