Yamaha Aerox 155 : 2023 యమహా ఏరోక్స్​ 155 లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే-2023 yamaha aerox 155 launched in india check feature price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Aerox 155 : 2023 యమహా ఏరోక్స్​ 155 లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే

Yamaha Aerox 155 : 2023 యమహా ఏరోక్స్​ 155 లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే

Sharath Chitturi HT Telugu
Apr 08, 2023 06:26 AM IST

2023 Yamaha Aerox 155 launched : 2023 యమహా ఏరోక్స్​ 155 మోడల్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ స్కూటర్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

2023 యమహా ఏరోక్స్​ 155 లాంచ్​..
2023 యమహా ఏరోక్స్​ 155 లాంచ్​.. (HT AUTO)

2023 Yamaha Aerox 155 launched in India : ఏరోక్స్​కు 2023 వర్షెన్​ను లాంచ్​ చేసింది యమహా మోటార్​ ఇండియా సంస్థ. ఈ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1,42,800గా ఉంది. ఈ 2023 యమహా ఏరోక్స్​ 155లో కొత్తగా సిల్వర్​ కలర్​ ఆప్షన్​ లభిస్తోంది. ఇప్పటికే ఈ స్కూటర్​ను మూడు రంగుల్లో విక్రయిస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అవి మెటాలిక్​ బ్లాక్​, రేసింగ్​ బ్లూ, గ్రే వెర్మీలియన్​. ఈ కొత్త వర్షెన్​లో ట్రాక్షన్​ కంట్రోల్​ సిస్టెమ్​ ఉంటుంది. ఈ సెగ్మెంట్​ స్కూటర్లలో ఈ సిస్టెమ్​ లభిస్తున్న తొలి వాహనం ఈ ఏరోక్స్​ 155 కావడం విశేషం.

ఇంజిన్​లో మార్పులు లేవు..

Yamaha Aerox 155 on road price in Hyderabad : 2023 యమహా ఏరోక్స్​ 155 ఇప్పుడు ఈ20 ఫ్యూయెల్​ కంప్లైంట్​. ఇందులో ఓబీడీ-2 సిస్టెమ్​ కూడా ఉంది. అదనంగా.. ఈ స్కూటర్​కు హజార్డ్​ స్విచ్​ స్టాండర్డ్​గా లభిస్తోంది. ఇంజిన్​లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో 155సీసీ బ్లూ కోర్​ ఇంజిన్​ విత్​ వీవీఏ (వేరియబుల్​ వాల్వ్​ యాక్చుయేషన్​) ఉంది. యమహా ఆర్​15లోనూ ఇదే వినియోగిస్తోంది సంస్థ. ఇందులో సీవీటీ ట్రాన్స్​మిషన్​ కొత్తగా యాడ్​ అయ్యింది. ఇక ఈ ఇంజిన్​.. 8000 ఆర్​పీఎం వద్ద 14.8 బీహెచ్​పీ పవర్​ను, 6,500 ఆర్​పీఎం వద్ద 13.9 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. 2023 యమహా ఏరోక్స్​ 155లో ఎల్​ఈడీ పొజీషనింగ్​ ల్యాంప్స్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​లైట్​, ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​, ఫ్రెంట్​ పవర్​ సాకెట్​, మల్టీ-ఫంక్షనల్​ కీ, ఎక్స్​టర్నల్​ ఫ్యూయెల్​ లిడ్​ వంటివి వస్తున్నాయి. 24.5 లీటర్​ కెపాసిటీతో కూడిన అండర్​ సీట్​ స్టోరేజ్​ కూడా ఉంది.

2023 Yamaha Aerox 155 features : ఇక ఈ ఏరోక్స్​ 155లో 14ఇంచ్​ అలాయ్​ వీల్స్​, 140 సెక్షన్​ రేర్​ టైర్​, ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్​, రేర్​లో ట్విన్​ గ్యాస్​ ఛార్జ్​డ్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి. ఫ్రెంట్​లో 230 ఎంఎం డిస్క్​, రేర్​లో 130ఎంఎం డ్రమ్​ బ్రేకింగ్​ సెటప్​ ఉంటుంది.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ 2023 యమహా ఏరోక్స్​ 155లో యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టెమ్​, సైడ్​ స్టాండ్​ ఇంజిన్​ కటాఫ్​ వంటివి లభిస్తున్నాయి. ఈ స్కూటర్​​ ఇన్​స్టెంట్​గా క్లిక్​ అవుతుందని సంస్థ భావిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం