2024 Hyundai Sonata : హ్యుందాయ్​ సొనాటా లేటెస్ట్​ వర్షెన్​.. ఇదిగో!-2024 hyundai sonata revealed with verna like design check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  2024 Hyundai Sonata Revealed With Verna Like Design: Check Full Details Here

2024 Hyundai Sonata : హ్యుందాయ్​ సొనాటా లేటెస్ట్​ వర్షెన్​.. ఇదిగో!

Sharath Chitturi HT Telugu
Mar 27, 2023 11:53 AM IST

2024 Hyundai Sonata revealed : సొనాటా లేటెస్ట్​ వర్షెన్​ను ఆవిష్కరించింది హ్యుందాయ్​ మోటార్స్​. ఈ నెల 30న ఈ మోడల్​ లాంచ్​కానుంది. ఇందులో అనేక మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు..

ఇదిగో 2024 హ్యుందాయ్​ సొనాటా
ఇదిగో 2024 హ్యుందాయ్​ సొనాటా

2024 Hyundai Sonata revealed : 8వ జెనరేషన్​ సొనాటాను అధికారికంగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​. ఈ నెల 30న ప్రారంభంకానున్న సియోల్​ ఆటో షోలో ఈ వెహికిల్​ లాంచ్​కానుంది. డిజైన్​తో పాటు ఈ మోడల్​లో చాలా మార్పులు జరిగినట్టు కనిపిస్తున్నాయి. అయితే.. ఇటీవలే లాంచ్​ అయిన వెర్నా, కోనా ఎలక్ట్రిక్​ వాహనాలతో ఈ హ్యుందాయ్​ సొనాటా డిజైన్​ పోలి ఉంది. ఫలితంగా పాత మోడల్స్​ కన్నా ఈ సెడాన్​ మరింత ప్రత్యేకంగా నిలువనుంది. స్టాండర్డ్​తో పాటు హైబ్రీడ్​ వేరియంట్స్​లో ఇది అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు

హ్యుందాయ్​ సొనాటా.. కొత్తగా!

ఆల్​ న్యూ 2024 హ్యుందాయ్​ సొనాటాలో సిగ్నేచర్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్​ బార్​ ఉంది. వెర్నా, కోనా ఎలక్ట్రిక్​, స్టారియాలో కూడా ఇది కనిపిస్తుంది. ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, బంపర్స్​, ఫెండర్స్​ అప్డేట్​ అయ్యాయి. గ్రిల్​ అన్నది పారామెట్రిక్​ జ్యువెల్​ థీమ్​లో వస్తోంది. ఈ మార్పులతో హ్యుందాయ్​ సొనాటో మరింత ఎయిరోడైనమిక్​గా, బోల్డ్​గా కనిపిస్తోంది. సొనాటా ఎన్​-లైన్​ వర్షెన్​లో ఎన్​-లైన్​ బ్యాడ్జింగ్​ ఉంటుంది. గ్రిల్​ కాస్త డిఫరెంట్​గా ఉంటుంది.

New Hyundai Sonata launch : 2024 హ్యుందాయ్​ సొనాటా రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​లైట్​ స్ట్రిప్​, బ్లాక్​ బార్​, మధ్యలో హ్యుందాయ్​ లోగో వస్తాయి. టీ-షేప్​లో టెయిల్​గేట్స్​.. ఐయానిక్​ 5 మోడల్​ను పోలి ఉంది.

ఇక హ్యుందాయ్​ సొనాటా కేబిన్​లో డాష్​బోర్డ్​ డిజైన్​ కొత్తగా కనిపిస్తోంది. 12.3 ఇంచ్​ ట్విన్​ టచ్​స్క్రీన్​ డిస్​ప్లే లభిస్తోంది. ఇది ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ కింద పనిచేస్తుంది. వెర్నాలోని కర్వ్​డ్​ స్క్రీన్​ ఇందులోనూ కనిపిస్తుంది. ఈ సెడాన్​లో ఫుల్లీ ఎక్స్​టెండెడ్​ ఎయిర్​ వెంట్స్​, న్యూ సెంట్రల్​ క్లైమేట్​ కంట్రోల్​ ప్యానెల్​, న్యూ 3 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ వంటి మార్పులు చోటుచేసుకున్నాయి.

సొనాటో ఇంజిన్​ ఆప్షన్స్​..!

2024 Hyundai Sonata India Launch : సొనాటా టెక్నికల్​ స్పెసిఫికేషన్స్​కు సంబంధించిన వివరాలను హ్యుందాయ్​ మోటార్స్​ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం మార్కెట్​లో హైబ్రీడ్​తో పాటు మూడు రకాల పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. సొనాటా హైబ్రీడ్​లో 2.0 లీటర్​ స్మార్ట్​స్టెర్మ్​ జీడీఐ హెచ్​ఈవీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 152 పీఎస్​ పవర్​ను, 188ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్​ మోటార్​.. 38కేడబ్ల్యూ పవర్​ను, 205 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని మైలేజ్​ 20కేఎంపీఎల్​.

1.6 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 2.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 2.5 లీటర్​ టర్బో ఇంజిన్​ ఆప్షన్స్​ కూడా ఉన్నాయి. మూడోది.. హ్యుందాయ్​ సొనాటా ఎన్​-లైన్​కు వస్తోంది. సొనాటో మోడల్​లో ఇదే మోస్ట్​ పవర్​ఫుల్​ ఇంజిన్​. ఇది 285హెచ్​పీ పవర్​ను 422 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ డీసీటీ గేర్​బాక్స్​ ఉంటుంది.

2024 Hyundai Sonata launch details : ఇక హ్యుందాయ్​ సొనాటా స్పెసిఫికేషన్స్​, ధరతో పాటు ఇండియాలో లాంచ్​ అవుతుందా? లేదా? అన్న వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం