తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Basalt : సిట్రోయెన్​ బసాల్ట్​ కొంటున్నారా? ఈ కూపే ఎస్​యూవీ సేఫ్టీ రేటింగ్​ చెక్​ చేశారా?

Citroen Basalt : సిట్రోయెన్​ బసాల్ట్​ కొంటున్నారా? ఈ కూపే ఎస్​యూవీ సేఫ్టీ రేటింగ్​ చెక్​ చేశారా?

Sharath Chitturi HT Telugu

12 October 2024, 6:16 IST

google News
    • Citroen Basalt safety rating : సరికొత్త సిట్రోయెన్​ బసాల్ట్​ ఎస్​యూవీ కూపే కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మరి ఈ సిట్రోయెన్​ బసాల్ట్​ సేఫ్టీ రేటింగ్​ ఎంతో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
సిట్రోయెన్​ బసాల్ట్​ సేఫ్టీ రేటింగ్​ ఎంతో తెలుసా?
సిట్రోయెన్​ బసాల్ట్​ సేఫ్టీ రేటింగ్​ ఎంతో తెలుసా?

సిట్రోయెన్​ బసాల్ట్​ సేఫ్టీ రేటింగ్​ ఎంతో తెలుసా?

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇటీవలే లాంచ్​ అయిన సిట్రోయెన్​ బసాల్ట్​ ఎస్​యూవీ కూపేని కొనాలని చూస్తున్నారా? అయితే.. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ కారు ఎంత సేఫ్టీ రేటింగ్​ సాధించిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

సిట్రోయెన్ బసాల్ట్ భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ రిజల్ట్​..

భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్​సీఏపీ) కింద పరీక్షించిన సిట్రోయెన్​ బసాల్ట్​ క్రాష్ టెస్ట్​లో 4 స్టార్​ రేటింగ్​ని సాధించింది. అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో 32 పాయింట్లకు గాను బసాల్ట్ 26.19 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో 49 పాయింట్లకు గాను 35.90 పాయింట్లు సాధించింది. 

టాప్-స్పెక్ టర్బో మ్యాక్స్ వేరియంట్​ని ఆగస్టు నెలలో క్రాష్ టెస్టులు నిర్వహించారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.

ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మెబుల్ బారియర్ టెస్ట్​లో సిట్రోయెన్ బసాల్ట్ 16కు 10.19 పాయింట్లు సాధించింది. ఈ పరీక్షలో డ్రైవర్ ముందు ప్రయాణికుడి తల, మెడకు రక్షణ "గుడ్​" అని తేలింది. డ్రైవర్ ఛాతీ, తొడలకు "స్వల్ప" రక్షణను లభించింది. మరోవైపు, ముందు ప్రయాణికుడు ఛాతీకి "సరిపడా" రక్షణ, తొడలకు స్వల్ప రక్షణను చూపించింది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, కొత్త సిట్రోయెన్ బసాల్ట్ సైడ్ మూవెబుల్ డిఫార్మెబుల్ బారియర్ టెస్ట్​లో 16 పాయింట్లకు 16 పాయింట్లు సాధించింది.

చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​కు సంబంధించి, బసాల్ట్ 18 నెలల పిల్లాడు, మూడు సంవత్సరాల పిల్లాడి రక్షణ రెండింటికీ చైల్డ్ కంట్రోల్ సిస్టమ్​లను ఉపయోగించడం ద్వారా డైనమిక్ స్కోర్​లో 24 పాయింట్లకు 19.90 పాయింట్లు సాధించింది.

సిట్రోయెన్ బసాల్ట్ సేఫ్టీ..

ఈ కూపే ఎస్​యూవీలో స్టాండర్డ్​గా ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్​పీ, హిల్ హోల్డ్, ఐసోఫిక్స్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్​బెల్ట్​లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉన్నాయి.

సిట్రోయెన్ బసాల్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు..

సిట్రోయెన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ మోటార్ 80బీహెచ్​పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్​ చేస్తుంది. ఇది లోయర్​ వేరియంట్​లలో ఉంటుంది. ఇక హై ఎండ్​ వేరియంట్లలో 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్​త వస్తుంది. ఇది 109 బీహెచ్​పీ, 190 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 

సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు..

కొత్త సిట్రోయెన్ బసాల్ట్​లో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచ్​ అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్స్, రేర్​ ఏసీ వెంట్స్, రెండో వరుసలో ఉన్నవారికి అడ్జెస్టెబుల్ థై సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వైర్​లెస్​ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్​తో కూడిన 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఇందులో ఉంది.

తదుపరి వ్యాసం