తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Basalt On Road Price Hyderabad : హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Citroen Basalt on road price Hyderabad : హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

18 August 2024, 9:14 IST

google News
    • Citroen Basalt price Hyderabad : సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ కొనాలని భావిస్తున్నారా? హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..
హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో లేటెస్ట్​ ఎంట్రీ సిట్రోయెన్​ బసాల్ట్​. ఇదొక కూపే ఎస్​యూవీ. భారత మాస్​ మార్కెట్​లో తొలి కూపే ఎస్​యూవీగా నిలిచింది సిట్రోయెన్​ బసాల్ట్​. ఈ మోడల్​పై కస్టమర్స్​లో ఆసక్తి పెరుగుతోంది. మీరు కూడా సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో సిట్రోయెన్​ బసాల్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

సిట్రోయెన్​ బసాల్ట్​ యూ- రూ. 9,53,020

సిట్రోయెన్​ బసాల్ట్​ ప్లస్​- రూ. 11.88 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ ప్లస్​ టర్బో- రూ. 14.11 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ మ్యాక్స్​ టర్బో- రూ. 15.07 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ మ్యాక్స్​ టర్బో డీటీ- రూ. 15.51 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ ప్లస్​ టర్బో ఏటీ- రూ. 15.61 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ మ్యాక్స్​ టర్బో ఏటీ- రూ. 16.70 లక్షలు

సిట్రోయెన్​ బసాల్ట్​ మ్యాక్స్​ టర్బో ఏటీ డీటీ- రూ .17.14 లక్షలు

అంటే ఈ మోడల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 9.5లక్షలు- రూ. 17.14 లక్షల మధ్యలో ఉంటుంది. మ్యాక్స్​ టర్బో ఏటీ డీటీ టాప్​ మోడల్​. ఇండియాలో సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ కేవలం పెట్రోల్​ వేరియంట్​లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

సాధారణంగా వెహికిల్​ని లాంచ్​ చేసేటప్పుడు సంస్థ దాని ఎక్స్​షోరూం ప్రైజ్​ని మాత్రమే ప్రకటిస్తుంది. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే వెహికిల్​ని కొనే ముందు ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకుంటే ఉత్తమం. మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే, ఆఫర్స్​తో పాటు మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయి.

సిట్రోయెన్​ బసాల్ట్​ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు సెప్టెంబర్​ మొదటివారంలో ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది.

సిట్రోయెన్​ బసాల్ట్​ వివరాలు..

సిట్రోయెన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మొదటిది 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 80 బిహెచ్​పీ పవర్​ని, 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది, ఇది ప్రత్యేకంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. రెండొవ ఆప్షన్​ 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 109 బీహెచ్​పీ పవర్​ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 190 ఎన్ఎమ్ టార్క్​ని అందించే 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్​మిన్​ లేదా 205 ఎన్ఎమ్ టార్క్ అందించే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో వస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే, సిట్రోయెన్ బసాల్టలో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, 16-ఇంచ్​ అల్లాయ్ వీల్స్, రాప్ రౌండ్ టెయిల్ లైట్లు, రేర్​ ఎయిర్ కండిషనింగ్ వెంట్​లు, రెండొవ వరుసలో ప్రయాణీకులకు అడ్జెస్టెడ్​థై సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ కూపే ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు వైర్ లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.

సిట్రోయెన్​ బసాల్ట్​కి పోటీగా సెప్టెంబర్​లో టాటా కర్వ్​ కూపే ఎస్​యూవీ లాంచ్​కానుంది.

తదుపరి వ్యాసం