తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : సింగిల్​ ఛార్జ్​తో 103 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సిటీ డ్రైవ్​ కోసమే!

Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో 103 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సిటీ డ్రైవ్​ కోసమే!

Sharath Chitturi HT Telugu

15 December 2024, 6:38 IST

google News
    • Electric scooter for city drive : సిటీ డ్రైవ్​ కోసం కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని చూస్తున్నారా? అయితే సింగిల్​ ఛార్జ్​తో 103 కి.మీ రేంజ్​ఇచ్చే ఈ ఈ-స్కూటర్​ వివరాలను మీరు తెలుసుకోవాల్సిందే..
బాట్​ఆర్​ఈ స్టోరీ ఎపిక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​, ధర వివరాలు..
బాట్​ఆర్​ఈ స్టోరీ ఎపిక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​, ధర వివరాలు..

బాట్​ఆర్​ఈ స్టోరీ ఎపిక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​, ధర వివరాలు..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఎలక్ట్రిక్​ 2 వీలర్​లో ఈ డిమాండ్​ తారస్థాయిలో ఉంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థలతో పాటు కొత్త కొత్త సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. ఫలితంగా తక్కువ ధరకే, ఎక్కువ రేంజ్​- అధిక ఫీచర్స్​తో ఈవీలు మార్కెట్​లోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి బాట్​ఆర్​ఈ స్టోరీ ఎపిక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​. సిటీ డ్రైవ్​కి ఉపయోగపడే విధంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఈవీ రేంజ్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సిటీ డ్రైవ్​కి బెస్ట్​ ఈ​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బాట్​ఆర్​ఈ స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.94,999 గా ఉంది. స్టోరీ ఎపిక్ చౌకగా, స్టైలిష్​గా, పర్ఫార్మెన్స్​ బేస్డ్​ కస్టమర్స్​కి నచ్చే విధంగా రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.

అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ 12 కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం విశేషం. మిడ్​నైట్ బ్లాక్, క్యాండీ రెడ్, ఐస్ బ్లూ, పర్ల్ వైట్, ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, స్టార్​లైట్ బ్లూ, బ్లేజింగ్ బ్రాంజ్, హంటర్ గ్రీన్, కాస్మిక్ బ్లూ, గన్​మెటల్ బ్లాక్, గోల్డ్ రష్ వంటి కలర్స్​ ఉన్నాయి. స్కూటర్ మన్నికను పెంచడానికి బాడీ ప్యానెల్స్ మెటల్​తో తయారు చేయడం జరిగింది.

బాట్​ఆర్​ఈ ఈ స్కూటర్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 103 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ స్కూటర్​లోని 60 వీ 40 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఐపీ 67-రేటింగ్ కలిగి ఉంది. కాబట్టి ఇది డస్ట్​- వాటర్ ప్రూఫ్. బ్యాటరీ ప్యాక్ డిటాచెబుల్. బ్యాటరీ ప్యాక్​ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది.

బ్యాటరీ సామర్థ్యం 2.3 కిలోవాట్లు కాగా, బాట్​ఆర్​ఈ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. డిజిటల్ స్క్రీన్​లో డిస్టెన్స్​ టు ఎంప్టీ, బ్యాటరీ టెంపరేఛర్​, ఛార్జ్ చేయడానికి సమయం వంటి సమాచారాన్ని చూపిస్తుంది.

బాట్​ఆర్​ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫౌండర్ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ, “స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్​ స్కూటర్ పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయాలనే మా నిబద్ధతకు నిదర్శనం. ఇది పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు.. ఆచరణాత్మక, నమ్మదగిన, ప్రయాణించడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది,” అని అన్నారు.

స్టోరీ ఎపిక్ కాకుండా, బాట్​ఆర్​ఈ లైనప్​లో మరో మూడు ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఉన్నాయి. అవి.. వన్, లోవ్, స్టోరీ ఉన్నారు. డిజైన్ పరంగా స్టోరీ- ఎపిక్​లలో​ చాలా పోలికలు ఉన్నాయి. ఈ రెండింటినీ రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గా డిజైన్ చేశారు.

తదుపరి వ్యాసం