తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Prepaid Plans : 1 ఇయర్​ వాలిడిటీతో బెస్ట్​ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ఇవే..!

Best prepaid plans : 1 ఇయర్​ వాలిడిటీతో బెస్ట్​ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu

26 May 2023, 14:10 IST

    • Best prepaid plans with 1 year validity : 1 ఇయర్​ వాలిడిటీతో ప్రీపెయిడ్​ ప్లాన్స్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీరు చూడాల్సిందే..!
1 ఇయర్​ వాలిడిటీతో బెస్ట్​ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ఇవే..!
1 ఇయర్​ వాలిడిటీతో బెస్ట్​ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ఇవే..! (REUTERS)

1 ఇయర్​ వాలిడిటీతో బెస్ట్​ ప్రీపెయిడ్​ ప్లాన్స్​ ఇవే..!

Best prepaid plans with 1 year validity : మీరు ఎక్కువగా డేటా వాడుతుంటారా? ఫ్రెండ్స్​తో లేదా ఉద్యోగ అవసరాల కోసం ఎక్కువగా కాల్స్​ చేయాల్సి వస్తుందా? ప్రతి నెల సిమ్​లను రిఛార్జ్​ చేసి చేసి విసిగెత్తిపోయారా? అయితే మీరు ఇది చూడాల్సిందే! ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్​టెల్​, జియో, వోడాఫోన్​ ఐడియాలు.. తమ యూజర్లకు యాన్యువల్​ ప్లాన్స్​ను అందుబాటులో ఉంచుతున్నాయి. మరి వాటి ధరలు, వార్షిక ప్లాన్స్​తో వచ్చే బెనిఫిట్స్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఎయిర్​టెల్​ రూ. 1,799 ప్లాన్​..

బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​ ఉండి భారీ మొత్తంలో డేటాను వినియోగించని వారికి ఈ ప్లాన్​ సూట్​ అవుతుంది. 365 రోజుల వాలిడిటీతో ఈ ఎయిర్​టెల్​ 1799 ప్రీపెయిడ్​ ప్లాన్​పై అన్​లిమిటెడ్​ కాలింగ్​ పొందవచ్చు. అంతేకాకుండా 3,600 మెసేజ్​లు (రోజుకు 100), 24జీబీ డేటా లభిస్తుంది. ఈ 24జీబీ డేటా అన్నది 365 రోజులకు వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. రోజువారీ డేటా వినియోగంపై ఎలాంటి లిమిట్​ లేదు. ఉచిత హెలో టూన్స్​, వింక్​ మ్యూజిక్​ ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ వంటివి ఈ ప్లాన్​లో భాగం.

Airtel Annual plan : యాన్యువల్​ ప్లాన్​లో ఎక్కువ డేటా కావాలని భావించే వారికి.. రోజుకు 2జీబీ 4జీ డేటా లిమిట్​తో రూ. 2,999 ఎయిర్​టెల్​ ప్రీపెయిడ్​ ప్లాన్​ను ఎంచుకోవచ్చు.

జియో రూ. 2879 ప్లాన్​..

జియోలో 365 రోజుల వాలిడిటీతో అత్యంత చౌకైన ప్లాన్​ ఈ రూ. 2,879 ప్లాన్​. ఇందులో రోజుకు 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. అన్​లిమిటెడ్​ కాలింగ్​, జియో సినిమా, జియోటీవీ వంటి వాటికి యాక్సెస్​ లభిస్తుంది. 5జీ స్మార్ట్​ఫోన్​ నుంచి 5జీ డేటా కూడా వస్తుంది. రోజుకు 2.5జీబీ 4జీ డేటా ప్యాక్​ కావాలి అని అనుకుంటే. రూ. 2,999 ప్లాన్​ను మీరు ఎంచుకోవచ్చు.

Jio prepaid recharge plans : జియో నుంచి రూ. 2,545 ప్లాన్​ కూడా ఉంది. అయితే.. ఇది 336 రోజులకు మాత్రమే ఉంటుంది. రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అన్​లిమిటెడ్​ కాల్స్​ వంటి బెనిఫిట్స్​ ఇందులో ఉన్నాయి.

వీఐ రూ, 1799 ప్లాన్​..

ఎయిర్​టెల్​కు పోటీగా యాన్యువల్​ ప్లాన్​ను తీసుకొచ్చింది వోడాఫోన్​ఐడియా. దీని వాలిడిటీ 365 రోజులు. 365 రోజుల వరకు 24జీబీ 4జీ డేటా లభిస్తుంది.

ఇక రూ. 2,899 యాన్యువల్​ ప్యాక్​లో రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, అన్​లిమిటెడ్​ కాలింగ్​, వీఐ మూవిస్​- టీవీ యాప్​కు ఫ్రీ యాక్సిస్​ వంటి బెనిఫిట్స్​ పొందవచ్చు.

Vodafone Idea recharge plan : కాగా.. ఈ ప్లాన్​తో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్​లిమిటెడ్​ డేటాతో ఉచితంగా డౌన్​లోడ్స్​, స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు. ఈ ప్యాక్​కు అదనంగా 50జీబీ 4జీ డేటా ఆప్షన్​ను కూడా ఇస్తోంది వీఐ. సోమవారం నుంచి శుక్రవాం వారకు ఏదైనా డేటాను వాడకుండా ఉంచేస్తే.. అది శని, ఆదివారాలకు ఫార్వర్డ్​ అవుతుంది.

తదుపరి వ్యాసం